NTV Telugu Site icon

Devara Rights: రికార్డు ధరకు దేవర రైట్స్.. భారీ టార్గెట్ తో బరిలోకి

Devara

Devara

Devara overseas Rights sold for 27 Crores: టాలీవుడ్‌లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – బడా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘దేవర’ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయని తెలిసిందే. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ‘దేవర’ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి భాగాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించి షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఇలా ఇప్పటి వరకూ ఎన్నో షెడ్యూళ్లను పూర్తి చేసి 80 శాతం టాకీ పార్టును కంప్లీట్ చేశారు. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘దేవర’ మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ బిజినెస్ కూడా మొదలు పెట్టేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్‌ను భారీ ధరలకు క్లోజ్ చేయగా థియేట్రికల్ రైట్స్‌ కూడా ఏరియాల వారీగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు.

Trivikram: ఎట్టకేలకు గుంటూరు కారం హడావుడి తరువాత దర్శనమిచ్చిన గురూజీ

సక్సెస్‌ఫుల్ ‘దేవర’ మూవీకి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్‌ డీల్ తాజాగా క్లోజ్ అయినట్లు తెలిసింది. తాజాగా ఓవర్సీస్ రైట్స్‌ను బడా సంస్థ హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుందని యూనిట్‌కు సందరు సంస్థ ఏకంగా రూ. 27 కోట్ల రూపాయలు అంటే యూఎస్ కరెన్సీలో 3.3 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘దేవర’ ఓవర్సీస్ రైట్స్ కోసం హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఇచ్చిన మొత్తం ఎన్టీఆర్ సోలో కెరీర్‌లోనే టాప్ రికార్డు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ చేరుకోవాలంటే 6.5 మిలియన్ డాలర్లు అంటే రూ. 54 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. ‘దేవర’ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండగా అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాలో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు.