జూనియర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమా తో గ్లోబల్ వైడ్ గా ఎంతగానో పాపులర్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఈయన క్రేజ్ బాగా పెరిగింది.మరి ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన తరువాత చేయబోయే సినిమాలను ఎంతో జాగ్రత్త గా ఎంచుకుంటున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ ఏవైటెడ్ సినిమా ‘దేవర’.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతుంది.గతం లో వీరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లక్ బస్టర్ హిట్ గా నిలిచింది..దీనితో దేవర సినిమా పై ఫ్యాన్స్ భారీ గా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది.అలాగే ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.
ఎన్టీఆర్ బర్త్డే సందర్బంగా ఈ సినిమా కు సంబంధించి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు..విడుదల అయిన ఎన్టీఆర్ లుక్ కి ఫ్యాన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది.. కొరటాల శివ ఈ సినిమాను భారీ యాక్షన్ చిత్రం గా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా లో కొన్ని సీన్స్ యదార్థ సంఘటన ల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.దీంతో ఈ సినిమా కోసం కొరటాల మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పుడొక క్రేజీ రూమర్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది.ఈ సినిమా లో క్లైమాక్స్ సీన్స్ ఫ్యాన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని సమాచారం. అలాగే క్లైమాక్స్ లో దేవర సినిమా సీక్వెల్ కి సంబంధించిన లీడ్ కూడా రివీల్ అవుతుందని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.