Definition of Movie Industry hit: సినిమాలను ఇండస్ట్రీ హిట్ , బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, హిట్, ఎబౌ యావరేజ్, యావరేజ్, బిలో యావరేజ్, ఫ్లాప్ మరియు అట్టర్ ఫ్లాప్ (డిజాస్టర్)గా వర్గీకరిస్తూ ఉంటారు ట్రేడ్ వర్గాల వారు. అయితే వాటిని కలెక్షన్స్ బేసిస్ మీద అలా వర్గీకరించినా ఎందుకు? ఏమిటి? ఎలా?
ఇండస్ట్రీ హిట్ : ఫుల్ రన్ కలెక్షన్స్ షేర్లలో కొత్త రికార్డ్ సృష్టించే సినిమాని ఇండస్ట్రీ హిట్ అంటారు. ఇది మునుపటి ఇండస్ట్రీ హిట్ యొక్క ఫుల్ రన్ (క్లోజింగ్) షేర్లను దాటాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఉన్న ఇండస్ట్రీ హిట్ అయితే ఆర్ఆర్ఆర్.
Definition of Movie Blockbuster hit:బ్లాక్‌బస్టర్: ఇండస్ట్రీ హిట్ స్టేటస్‌ను తృటిలో మిస్ అయిన సినిమా. లేదా సదరు ప్రాజెక్ట్‌తో అనుబంధం ఉన్న వ్యక్తులందరికీ గరిష్ట లాభాలను పొందీన సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా పరిగణించబడతాయి. అయితే కేవలం రూ.2 నుంచి 3 కోట్లతో తీసిన చిన్న బడ్జెట్ సినిమాలు రూ.5, 6 కోట్ల షేర్ రాబడితే వాటిని బ్లాక్ బస్టర్స్ గా పరిగణించలేం. బ్లాక్ బస్టర్ మూవీని అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో చూడాలి. చిన్న బడ్జెట్ సినిమా అయితే తప్పనిసరిగా కనీసం రూ.15+ కోట్లు వసూలు చేయాలి, దాని పరిమితి 30+ కోట్ల నుండి పెద్ద టిక్కెట్టు ఎంటర్‌టైనర్‌లకు వారి పెట్టుబడుల ఆధారంగా ప్రారంభమవుతుంది.
ఉదా: బాహుబలి, దసరా, బలగం, బేబీ, గబ్బర్ సింగ్, దూకుడు, రచ్చ, రేసుగుర్రం, సింహాద్రి, మిర్చి, సింహా, మనం మొదలైనవి.
Definition of Movie Super hit: సూపర్ హిట్: అన్ని ఏరియాల్లో చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టిన సినిమా సూపర్ హిట్‌గా పరిగణించబడుతుంది.
ఉదా: సలార్, హాయ్ నాన్న, వారసుడు, వాల్తేర్ వీరయ్య, దసరా లాంటి సినిమాలు.
Definition of Movie hit: హిట్: అన్ని ఏరియాల్లో తక్కువే అయినా లాభాలు తెచ్చుకున్న సినిమాలను హిట్ అనచ్చు.
ఉదా: విరూపాక్ష, సామజవరాగమనా మొదలైనవి.
Definition of Movie Above Average: ఎబోవ్ యావరేజ్ హిట్ (సెమీ హిట్): కొన్ని ఏరియాల్లో స్వల్ప నష్టాలు, కొన్ని ఇతర ప్రాంతాలలో స్వల్ప లాభాలు లేదా బ్రేక్ ఈవెన్‌లను పొందిన సినిమా ఈ కేటగిరీలోకి వస్తుంది. అయితే పెట్టిన పెట్టుబడితో సంబంధం లేకుండా ఒక సినిమా రూ.కోటి దాటితే. 45 కోట్ల షేర్, దాని పరిధి ఎబోవ్ యావరేజ్’తో ప్రారంభం అవుతుంది.
ఉదా:బాద్‌షా, టెంపర్, S/o సత్యమూర్తి మొదలైనవి.
Definition of Movie Average యావరేజ్: ఒక సినిమా కొన్ని ఏరియాల్లో నష్టాలను చవిచూసి, మరికొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటే యావరేజ్ గ్రాసర్ అని చెప్పవచ్చు. సినిమా మొత్తం వాటా దాని ప్రీ-రిలీజ్ బిజినెస్‌కి కొద్దిగా తక్కువగా లేదా సమానంగా ఉంటుంది.
ఉదా: బాలు, అర్జున్, సాంబ, గోవిందుడు అందరివాడేలే మొదలైనవి.
Definition of Movie Below Average బిలో యావరేజ్: ఒక సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో తక్కువ నష్టాలను చవిచూస్తే, దాన్ని బిలో యావరేజ్ గ్రాసర్ అని చెప్పవచ్చు. ఒకట్రెండు ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరుకునే అవకాశం ఉంది.
ఉదా: గుడుంబా శంకర్, టక్కరి దొంగ, అశోక్
Definition of Movie Flop ఫ్లాప్: ఒక సినిమా అన్ని ఏరియాల్లో గణనీయమైన నష్టాలను చవిచూస్తే, దానిని ఫ్లాప్ అని చెప్పవచ్చు.
ఉదా: తీన్మార్, అతిధి, కంత్రి మొదలైనవి.
Definition of Movie Utter Flop అట్టర్ ఫ్లాప్ (డిజాస్టర్): ఒక సినిమా అన్ని ఏరియాల్లోనూ నష్టాలను చవిచూస్తే, దానిని డిజాస్టర్‌గా పరిగణిస్తారు.
ఉదా: జానీ, ఆగడు, ఆరెంజ్, రభస, వరుడు, రెబెల్ మొదలైనవి.