Dead Pixels Trailer: మెగా డాటర్ నిహారిక కొణిదెల చాలా గ్యాప్ తరువాత డెడ్ పిక్సల్స్ అనే వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో మే 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నిహారిక కొణిదెల, అక్షయ్ లంగుసాని, వైవా హర్ష, సాయి రోనాక్ ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గేమ్ ధ్యాసలో పడి జీవితాలు నాశనం చేసుకున్న నలుగురు స్నేహితుల కథగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఇక టీజర్ తోనే ఆసక్తి రేపిన ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
గాయత్రీ, భార్గవ్, ఆనంద్ ముగ్గురు బాటిల్ ఆఫ్ థ్రోన్స్ అనే వీడియో గేమ్ ద్వారా పరిచయమవుతారు.. ఆ గేమ్ ఆడుతూనే మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇక గాయత్రీ ఆఫీస్ లో రోషన్ కొత్తగా జాయిన్ అవుతాడు. అతడిని గాయత్రీ లవ్ చేస్తూ ఉంటుంది. ఇక గాయత్రీ ఫ్రెండ్ కావడంతో రోషన్ ను కూడా గేమ్ లో జాయిన్ చేసుకుంటారు టీమ్ మేట్స్. ఇక గేమ్ లో XP పాయింట్స్ కోసం.. గేమ్ లోనే పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అవుతారు గాయత్రీ, భార్గవ్. ఇక ఆ పెళ్లి తరువాత భార్గవ్.. గాయత్రిని నిజంగానే భార్యగా ఫీల్ అవుతాడు. కానీ, గాయత్రీ మాత్రం, రోషన్ వెనుక పడుతుంది. అలా గేమ్ కోసం తమ జీవితాలను పణంగా పెట్టిన ఈ నలుగురు జీవితాలు చివరికి ఏం అయ్యాయి..? అనేది కథగా తెలుస్తోంది. గాయత్రీగా నిహారిక నటించింది. ఈ సిరీస్ మొత్తం గేమ్స్ మీదనే నడుస్తుంది. ట్రైలర్ లో నిహారిక చాలా స్టైలిష్ లుక్ లో కనిపించింది. మరి ఈ సిరీస్ తో మెగా డాటర్ రీ ఎంట్రీ వర్క్ అవుట్ అవుతుందో లేదో తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.