Site icon NTV Telugu

Rajeev Kanakala: ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది!

Rajeev Kanakala

Rajeev Kanakala

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ని ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ సిరీస్‌లోని రెండు ఎపిసోడ్స్‌ని మీడియాకి ప్రత్యేకంగా ప్రదర్శించారు.

అనంతరం నిర్వహించిన గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ ‘‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్‌కి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. నేను ఇప్పటి వరకు ఎన్నో రకరకాల పాత్రల్ని పోషించాను. అయితే ఈ సిరీస్‌లో చేసిన కారెక్టర్ మాత్రం మైల్ స్టోన్‌లా నిలుస్తుంది. ఇందులోని నా మాడ్యులేషన్, పాత్ర తీరు, డైలాగ్స్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. డైరెక్టర్ కృష్ణ నన్ను చాలా కొత్తగా చూపించారు. ఫిబ్రవరి 27న మా సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఏ ఒక్కరినీ నిరాశ పర్చదు.. బోలెడన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. ఉదయ భాను గారితో నేను చేసిన ప్రతీ ప్రాజెక్ట్ హిట్ అయింది. ఈ సిరీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

Exit mobile version