NTV Telugu Site icon

Dalapathi Vijay : సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న విజయ్?

Vijay

Vijay

దళపతి విజయ్ తమిళ్ స్టార్ హీరో.. ఈయన సినిమాలకు తమిళనాడు లో మంచిది మార్కెట్ ఉంది.. తెలుగులో కూడా ఈయనకు మంచి మార్కెట్ ఉంది.. తమిళ్ సినిమాలన్నీ తెలుగులో డబ్ కావడంతో ఇక్కడ కూడా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..తాజాగా వారసుడు సినిమాతో తెలుగు మార్కెట్ ను కూడా టార్గెట్ చేశాడు.. దాంతో తెలుగులో కూడా మార్కెట్ చాలా వచ్చింది.. ప్రస్తుతం ఈయన లియో సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమాకు తెలుగులో మంచిది మార్కెట్ ఏర్పడింది.. ఏకంగా రూ.22 కోట్లకు బిజినెస్ జరుగుతుంది.

తెలుగులో ఆయన రేంజ్ ఏ రేంజ్ ఏంటో తెలుస్తోంది. ఇక తెలుగు ఆడియన్స్ కూడా విజయ్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్ లో లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. లియో తరువాత విజయ్ ఓ సాహసమే చేయబోతున్నాడు. విజయ్ లియో సినిమా అక్టోబర్ 20న దసరా కానుకగా రిలీజ్ అవ్వబోతోంది. దాదాపు అన్ని భాషలను టార్గెట్ చేస్తూ విజయ్ ఈసినిమా ను రిలీజ్ చేయబోతున్నాడు. అంతే కాదు ఈసారి 1000 కోట్లు వసూలు చేసేలా టార్గెట్ చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ కూడా ఈ విషయం గట్టిగా నమ్ముతున్నారు.. ఈ ఏడాదికి భారీ హిట్ ను అందుకుంటుందని జనాలు భావిస్తున్నారు..

లియో తరువాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు. అసలే వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్నాడు వెంకట్ ప్రభు. తాజాగా నాగచైతన్యతో కస్టడీ సినిమా చేసి… పెద్ద డిజాస్టర్ అందుకున్నాడు. అయినా కూడా ఆయన కథ నమ్మి.. వెంకట్ ప్రభు మీద నమ్మకంతో ముందడుగు వేస్తున్నాడు విజయ్. లియో తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే నెక్ట్స్ ఇయర్ విజయ్ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ వెంకట్ ప్రభు సినిమా త్వరగా పూర్తి చేసి.. సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. అందుకు కారణం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని అందుకే సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం తమిళనాట ఇంతకంటే పెద్ద సంచలనం మరొకటి ఉండదు. లియో ఇదే ఏడాది రానుంది. వెంకట్ ప్రభు సినిమా 2024 స్టార్టింగ్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.. ఇక 2027 వరకు సినిమాలకు గ్యాప్ ఇవ్వనున్నాడు..