NTV Telugu Site icon

Daaku Maharaaj : వంద కోట్ల క్లబ్ లో డాకు మహారాజ్.. బాలయ్య కింగ్ అఫ్ సంక్రాంతి

Daakumaharaaj (2)

Daakumaharaaj (2)

గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో మెప్పించింది. వరుస హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతగానో అంచనాలు పెంచుకున్న ఈ సినిమా తొలి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Also Read : Manchu Family : నేను గొడవలు చేయడానికి రాలేదు : మంచు మనోజ్

జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ మొదటి రోజు రూ. 56 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక రెండు రోజులకు గాను రూ. 74కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే మూడు రోజులకు రూ. 92 కోట్లు రాబట్టాడు. ఇక ఈ గురువారానికి అనగా మొదటి నాలుగు రోజులకు వరల్డ్ వైడ్ గా రూ. 105 కోట్లు వసూలు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసాడు బాలయ్య. ఈ కలెక్షన్స్ తో వరుసగా నాలుగు సార్లు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్ తో ఈ రేర్ ఫీట్ ను సాధించాడు బాలయ్య. లాంగ్ రన్ లో ఈ సినిమా మరింత కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. అటు ఓవర్సీస్ లోను 1 మిలియన్ దాటి 2 మిలియన్ వైపు పరుగులు పెడుతున్నా డాకు మహారాజ్ ఈ ఏడాది సంక్రాంతి కింగ్ గా నిలిచాడు.

Show comments