JR NTR : దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఒకే ఒక్క ప్రాజెక్ట్ గురించి చర్చ జరుగుతోంది. అదే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్. ఈ మూవీని రాజమౌళి సమర్పణలో కార్తికేయ, వరుణ్‌గుప్తా నిర్మాతలుగా నితిన్ కక్కర్ డైరెక్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తారనే ప్రచారం ఉంది. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాగా ఇదే దాదాసాహెబ్ బయోపిక్ లో అమీర్ ఖాన్ నటిస్తాడని.. రాజ్ కుమార్ హిరాణీ డైరెక్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఇద్దరిలో ఎవరు ఇందులో నటిస్తారో అనే అనుమానాలు పెరుగుతున్న టైమ్ లో దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ తాజాగా స్పందించారు.
Read Also : Pawan Kalyan : సినిమాలు ఆలస్యం.. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం?
‘రాజమౌళి సమర్పణలో ఈ మూవీ వస్తుందని నేను కూడా వార్తల్లో విన్నాను. కానీ ఇప్పటి వరకు రాజమౌళి గానీ వాళ్ల టీమ్ గానీ మమ్మల్ని సంప్రదించలేదు. ఫాల్కే బయోపిక్ తీయాలంటే కనీసం మమ్మల్ని సంప్రదించాలి కదా. ఎందుకంటే మా తాత గారి గురించి మాకే బాగా తెలుస్తుంది. కానీ రాజమౌళి నుంచి ఎవరూ మా దగ్గరకు రాలేదు. కానీ అమీర్ ఖాన్-రాజ్ కుమార్ హిరాణీ టీమ్ మమ్మల్ని ఎన్నోసార్లు సంప్రదించింది. వాళ్లు మూడేళ్లుగా మాత్ టచ్ లో ఉన్నారు.
ఎన్నో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫాల్కే పాత్రలో అమీర్ ఖాన్ నటించడం నాకు సంతోషంగా ఉంది. అమీర్ ఖాన్ అద్భుతంగా నటిస్తారనే నమ్మకం నాకు ఉంది. వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఎప్పుడు ఏం కావాలన్నా వారికి నేను సపోర్ట్ చేస్తాను’ అంటూ తెలిపారు. ఆయన మాటలను బట్టి అమీర్ ఖాన్-రాజ్ కుమార్ ప్రాజెక్టు ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఎన్టీఆర్-రాజమౌళి ప్రాజెక్ట్ పరిస్థితిపై వారే క్లారిటీ ఇవ్వాలి.
Read Also : HHVM : మే 21న ‘వీరమల్లు’ గ్రాండ్ ప్రెస్ మీట్..
