Site icon NTV Telugu

Adi Saikumar: ‘సి.ఎస్.ఐ. సనాతన్’ డేట్ లాక్ చేశాడు!

Csi Sanatan

Csi Sanatan

CSI Sanathan: ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సీఎస్ఐ సనాతన్’. ఇందులో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ ఐ) ఆఫీస‌ర్ గా ఆది సాయికుమార్ నటిస్తున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ విడుదల తేదీని మంగళవారం చిత్ర దర్శక నిర్మాతలు లాక్ చేశారు. మార్చి 10వ తేదీన తమ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్, టీజర్ విడుదలై… మూవీ మీద ఆసక్తిని కలిగించాయి. ఓ యువ పారిశ్రామిక వేత్త హత్య జరిగిన తర్వాత ఐదుగురు అనుమానితులు ఐదు డిఫరెంట్ వెర్షన్స్ చెబుతారు. వారిలో హంతకుడిని సనాతన్ ఎలా కనిపెట్టాడనే దాన్ని దర్శకుడు శివ శంకర్ దేవ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారని నిర్మాత అజయ్ శ్రీనివాస్ తెలిపారు. అలీ రెజా, నందినీరాయ్, తాకర్ పొన్నప్ప, మధుసూదన్, వాసంతి, ఖయ్యూమ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో మిషా నారంగ్ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి అనీశ్‌ సోలోమాన్ సంగీతాన్ని అందించారు.

Exit mobile version