CPI Narayana: బిగ్ బాస్ మొదటి సీజన్ మొదలైనప్పటి నుంచి ఈ షోను బ్యాన్ చేయాలనీ సీపీఐ నారాయణ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ షో వలన ఎవరికి ఉపయోగం లేదని, అదొక బ్రోతల్ హౌస్ అని ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తూ వచ్చాడు. తాజాగా మరోసారి సీపీఐ నారాయణ ఘాటు విమర్శలు చేశాడు. ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ ” బిగ్ బాస్ ఆరవ సీజన్ ప్రారంభమయ్యింది. మొదటి నుంచి ఈ షో అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఒకరికి ఒకరు పరిచయం లేని వారిని తీసుకెళ్లి ఆ భూతాల స్వర్గంలో పడేస్తారు. వారు అక్కాతమ్ముళ్లు కాదు, భార్యాభర్తలు కాదు. ఒకే ఇంట్లో వారిని పడేసి సంస్కృతీ నేర్చుకోండి. ఆచారాలు నేర్చుకోండి అంటే అక్కడా నేర్చుకునేది.
యువతను బయటకు వదిలితే సమాజం బాగుపడుతుంది.. వారిని ఒక ఇంట్లో కట్టిపడేసి కోతుల ఆటలు ఆడిస్తున్నారు.. వాటిని లక్షలమంది కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు. బిగ్ బాస్ షో ఒక బ్రోతల్ హౌస్.. సామాజిక రుగ్మత.. చెడు సంకేతాలను చూపించే ఒక దరిద్రపు షో.. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బిగ్ బాస్ తీసేవారికి తప్ప వేరే ఎవరికి ఉపయోగం లేదు. నాగార్జున గారు వారి నాన్న నాగేశ్వరరావు ఎన్నో గొప్ప సినిమాలు తీశారు, ఎంతో డబ్బు సంపాదించారు. కానీ ఈ ముదనష్టపు షో డబ్బులు మీకెందుకు.. ఆ డబ్బుతో మీరు బాగుపడతారా..?” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
