Complaint on Producer Gnanavel Raja and his wife Neha: ప్రముఖ సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజా, ఆయన భార్య నేహాపై చెన్నై మాంబలం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఇల్లు చెన్నైలోని త్యాగరాయ నగర్‌లోని జగదీశ్వరన్ వీధిలో ఉంది. వాళ్ల ఇంట్లో లక్ష్మి అనే పనిమనిషి ఇంటి పనులు చేస్తోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం జ్ఞానవేల్ రాజా ఇంట్లో కొన్ని నగలు మాయమైనట్లు సమాచారం. దీంతో జ్ఞానవేల్ రాజా భార్య నేహాకి పనిమనిషి లక్ష్మిపై అనుమానం ఏర్పడింది. లక్ష్మిని మాయమైన నగల గురించి ఆరా తీశారు. మొదటి రోజు నేహా లక్ష్మిని నగల గురించి అడిగితే మరుసటి రోజు నుంచి లక్ష్మి పనికి రాలేదు.
Pithapuram: బాబాయ్ కోసం అబ్బాయ్.. పిఠాపురంలో మెగా హీరో ప్రచారం!
అలాగే లక్ష్మిని సంప్రదించే ప్రయత్నం చేయగా సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది. దీంతో నేహాకు మరింత అనుమానం వచ్చి ఈ విషయాన్ని భర్త జ్ఞానవేల్ రాజాకు తెలియజేసింది. సమస్య విన్న జ్ఞానవేల్ రాజా వెంటనే మాంబలం పోలీస్ స్టేషన్‌లో నగలు మాయమైనట్లు తన సహాయకుడి ద్వారా ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లో పనిచేసే పనిమనిషి లక్ష్మిపై కూడా అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు లక్ష్మిని పిలిపించి ఆభరణాల గురించి విచారించారు. మరుసటి రోజు లక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసిందని చెబుతున్నారు. ఇది గమనించిన బంధువులు వెంటనే ఆమెని రాయపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చగా ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత జ్ఞానవేల్ రాజా, ఆయన భార్య నేహాపై మాంబలం పోలీస్ స్టేషన్‌లో తన తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించారని లక్ష్మి కుమార్తె ఫిర్యాదు చేసింది.
జ్ఞానవేల్ రాజా భార్య నేహా ఆ నగలను ఎక్కడో పోగొట్టుకున్నారని, దానికి తన తల్లి లక్ష్మిపై నిందలు వేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రముఖ సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజా, ఆయన భార్య, కుటుంబసభ్యులపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు కావడం సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. నిర్మాత జ్ఞానవేల్ రాజా నటులు శివకుమార్, సూర్య, కార్తీలకు బంధువు. జ్ఞానవేల్ రాజా ‘పరుత్తివీరన్’ సినిమాతో నిర్మాతగా తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. అయితే ‘పరుత్తివీరన్’ సినిమాలో జ్ఞానవేల్ రాజా, దర్శకుడు అమీర్ మధ్య తీవ్ర సమస్య నెలకొంది. కొన్ని నెలల క్రితం కూడా ఈ అంశం మళ్లీ చర్చనీయాంశమైంది. ఇక ఇప్పుడు కూడా సూర్య హీరోగా ఆయన నిర్మాణంలో భారీ వ్యయంతో ‘కంగువ’ సినిమా రూపొందుతోంది. అలాగే విక్రమ్ – పా.రంజిత్ కాంబినేషన్‌లో రూపొందిన ‘తంగళన్’ చిత్రాన్ని కూడా జ్ఞానవేల్ రాజా నిర్మించారు.