NTV Telugu Site icon

Colour Photo: జాతీయ అవార్డు విన్నింగ్ సినిమా.. మెగా డాటర్ మిస్ అయ్యిందే..?

Niharika

Niharika

Colour Photo: సుహాస్, చాందిని చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శహకత్వంలో తెరకెక్కిన చిత్రం కలర్ ఫోటో. సాయి రాజేశ్ నీలం, బెన్నీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమా 2020 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకోంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక తాజాగా ఈ చిత్రం జాతీయ అవార్డును నడుకోవడం విశేషం. శుక్రవారం సాయంత్రం 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఢిల్లీలో ప్రకటించిన విషయం విదితమే. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఈ సినిమా అవార్డును అందుకోవడంతో ఒక్కసారిగా ఈ సినిమా సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో చిత్ర బృందం ఇచ్చిన ఇంటర్వ్యూ, సినిమా గురించి చెప్పుకొచ్చిన విషయాలు మరోసారి వార్తలో నిలిచాయి. స్టార్ క్యాస్టింగ్ లేదు, దర్శకుడికి మొదటి చిత్రం,యూట్యూబ్ లో వీడియోలు చేసేవారు అందరూ కలిసి ఈ సినిమాను నిర్మించారు.

ఇక మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా మెగా డాటర్ నిహారికకు అనుకున్నట్లు డైరెక్టర్ బాహాటంగానే చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అర్రే ఈ సినిమాను నిహారిక చేసి ఉంటే.. బావుండేదని, ఒక జాతీయ అవార్డును అందుకున్న సినిమాలో నటించిన ఫీల్ మెగా డాటర్ నిహారికకు ఉండేదని అనుకుంటున్నారు. అయితే డైరెక్టర్ సందీప్, నిహారిక అని చెప్పుకొచ్చాడు కానీ, ఆమె దగ్గరకు భయం వలన వెళ్లలేకపోయానని, వెళ్లి కథ చెప్పాలంటే భయం వేసిందని తెలిపాడు. ఇక రెండో ఆప్షన్ గా చాందినీ చౌదరి ని అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆమె దగ్గరకి వెళ్లి కథ చెప్పగానే ఆమె ఓకే చెప్పిందని, చాందినిని చూస్తే దీప్తి వర్మనే గుర్తొచ్చింది. హీరోయిన్ పాత్రకు ఆమె కరెక్ట్ అని అనిపించినట్లు చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనా సందీప్ కాసింత దైర్యం చేసి నిహారికకు చెప్పి ఉంటే.. ఆమె కూడా ఒప్పుకొని ఉండేదేమో అని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.