NTV Telugu Site icon

Cobra Teaser: విక్రమ్ నట విశ్వరూపం.. ‘అపరిచితుడు’ ను మించి

Cobra

Cobra

Cobra Teaser: చియాన్ విక్రమ్, కెజిఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి జంటగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కోబ్రా. 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ఎస్ లలిత్ కుమార్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. “ప్రతి సమస్యకు ఒక మ్యాథమ్యాటికల్ సొల్యూషన్ ఉంటుందని విక్రమ్ వాయిస్ తో టీజర్ మొదలయ్యింది. కోబ్రా ఈజ్ ఏ జీనియస్ మ్యాథమ్యాటీషియన్.. అతను మ్యాథ్స్ ఉపయోగించి అసాధ్యమైన క్రైమ్స్ చేస్తుంటాడు అంటూ ఒక అమ్మాయి వాయిస్ తో సినిమా కథను చూపించేశారు. లెక్కల మాస్టర్ మది.. తన మేథస్సును ఉపయోగించి క్రైమ్స్ చేస్తూ ఉంటాడు.

అతడిని పట్టుకోవడానికి పోలీసులు. ఇంటర్ పోల్ తిరుగుతూ ఉంటుంది. వారి నుంచి తప్పించుకొని కోబ్రా ఎలాంటి క్రైమ్స్ చేశాడు. అసలు లెక్కల మాస్టర్ మది.. కోబ్రా గా ఎందుకు మారాడు..? అనేది కథగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం విక్రమ్ చాలా కష్టపడ్డాడు అనేది ముందు నుంచి విన్న మాటే. తాజాగా టీజర్ లో విక్రమ్ కష్టం కనిపిస్తోంది. ఇందులో దాదాపు 10 అవతారాలలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో క్రికెటర్ ఇర్పాన్ పఠాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా ఆగస్టు 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా విక్రమ్ కు ఎలాంటి విజయాన్ని అందివ్వనున్నదో చూడాలి.

Show comments