NTV Telugu Site icon

Producers Council: థియేటర్ల బంద్ ఫేక్.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన

Tfpc News

Tfpc News

Clarification from Apex Bodies Telugu Cinema Regarding Temporary Closing of Single Screens: థియేటర్ల మూతపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది. ఈమేరకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. గుంటూరు ఏరియాతో పాటు ఆంధ్రలోని మరికొన్ని ప్రాంతాల్లో సినిమా థియేటర్ల యజమానులు గత కొన్ని నెలలుగా తగిన ఆదాయం పొందలేకపోతున్నారని, తద్వారా డిజిటల్ ప్రొవైడర్లకు (UFO, Qube) ఛార్జీలు చెల్లించలేక పోతున్నారని కారణాలు చూపుతూ తమ సినిమా థియేటర్లను మూసివేసినట్లుగా మా దృష్టికి వచ్చింది. అదే విధంగా తెలంగాణలో కూడా కొన్ని సినిమా థియేటర్ల యజమానులు తమ ఇష్టానుసారం తమ థియేటర్లను ప్రేక్షకులు లేని కారణంగా ప్రదర్శన రద్దు చేయడమైనది అని ప్రకటించారు. ప్రధానంగా ఎన్నికలు మరియు IPL కారణంగా తక్కువ ఫుట్ ఫాల్స్ కారణంగా జరిగింది, తద్వారా ఆదాయంపై ప్రభావం పడింది. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అపెక్స్ బాడీస్ అంటే తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి సంబంధం లేకుండా, ఒక సంఘం సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాము.

Acid Attack: ఇక్ఫాయి యూనివర్సిటీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ అటాక్‌!

సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అలాగే ప్రింట్ మీడియాలో సినిమా థియేటర్ల మూసి వేతకు సంబంధించి, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా నుండి ఏ గ్రూప్ గాని సినిమా థియేటర్ యజమానులు లేదా మరే ఇతర అసోసియేషన్ నుండి గాని అపెక్స్ బాడీలకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని మేము పునరుద్ఘాటిస్తున్నాము. అందుకే థియేటర్ల బంద్ ఫేక్ అని తెలియజేస్తున్నాం. ఇది తక్కువ వసూళ్లు రావడంతో థియేటర్లను మూసివేసిన కొందరు థియేటర్ యజమానుల వ్యక్తిగత నిర్ణయం. దీనికి సంబంధించి, పైన పేర్కొన్న అన్ని అపెక్స్ బాడీస్ అంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి సినిమా థియేటర్ల మూసివేతకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నాం మా సంస్థలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తాయి అంటూ సెక్రటరీ టీ ప్రసన్న కుమార్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

Show comments