Site icon NTV Telugu

Vikkatakavi: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘వికటకవి’.. ట్రైల‌ర్‌ కట్ చూశారా?

Vikatakavi News

Vikatakavi News

ZEE5 కొత్త వెబ్ సిరీస్ ‘వికటకవి’ న‌వంబ‌ర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మించారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ సిరీస్ కావటం విశేషం. తాజాగా ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను హీరో విశ్వ‌క్ సేన్ రిలీజ్ చేశారు.

Koti Deepotsavam 2024: కోటి దీపాల పండుగ.. కోటి దీపోత్సవం ఈ నెల 9 నుంచి 25 వరకు..

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల ప్రాంతంలోని ‘అమరగిరి’ అనే ప్రాంతాన్ని 30 ఏళ్లుగా పట్టి పీడిస్తున్న ఓ శాపం కారణంగా అక్కడి దేవ‌త‌ల గ‌ట్టుకి వెళ్ల‌టానికి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతుంటారు. దాన్ని దేవ‌త శ‌పించిన గ్రామ‌మ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు భావిస్తూ ఉండగా ఆ గ్రామానికి చెందిన ప్రొఫెస‌ర్ మాత్రం హైద‌రాబాద్ ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ప‌ని చేస్తుంటాడు. అమ‌ర‌గిరిలో ఎవ‌రూ చేదించ‌లేని స‌మ‌స్య ఉంద‌ని భావించి, దాని ప‌రిష్కారానికి త‌న శిష్యుడైన రామ‌కృష్ణ‌ను పంపిస్తాడు. అమ‌ర‌గిరి ప్రాంతానికి వెళ్లిన రామ‌కృష్ణ ఏం చేస్తాడు.. అక్క‌డి స‌మ‌స్య‌ను ఎలా గుర్తిస్తాడు.. ఎలా ప‌రిష్క‌రిస్తాడు.. అనే అంశాల‌ను ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించిన‌ట్లు ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ సిరీస్ కి అజయ్ అరసాడ సంగీతాన్ని అందిస్తుండగా షోయబ్ సిద్ధికీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Exit mobile version