NTV Telugu Site icon

Double Ismart: టీవీలోకి డబుల్ ఇస్మార్ట్.. ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?

Double Ismart Ott

Double Ismart Ott

జీ తెలుగు ఈ వారం మరో కొత్త సినిమాతో వచ్చేస్తోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను ఈ వారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందిస్తోంది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్,రామ్ నటవిశ్వరూపంతో అదరగొట్టిన డబుల్ ఇస్మార్ట్, ఈ ఆదివారం(అక్టోబర్ 27న)సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Laggam Movie Review: లగ్గం రివ్యూ

రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ సినిమా మీద కూడా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఒక రకంగా పూరి జగన్నాథ్ కి ఇది మరొక సెట్ బ్యాక్ అని చెప్పాలి. రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, గెటప్ శ్రీను, అలీ, షాయాజీ షిండే,ఝాన్సీ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. యాక్షన్, కామెడీ, థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మాస్ ఎంటర్టైనర్ టీవీలో చూసేందుకు రెడీ అవండి.

Show comments