NTV Telugu Site icon

YVS: 80స్ బ్యాక్ డ్రాప్ లో వైవిఎస్ చౌదరి-నందమూరి తారక రామారావు సినిమా

Yvs Chowdary

Yvs Chowdary

YVS Chowdary Speech at New Talent Roars @ Press Meet: ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి వీణ రావ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని “న్యూ టాలెంట్ రోర్స్ @” బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున సెలబ్రేట్ చేసుకుంటూ, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా 1980 నేపథ్యంలో ఉంటుంది అని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ.. సభకు నమస్కారం. ఈ సినిమాకు సంబంధించిన మొదటి ఈవెంట్ మా ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు గారి అబ్బాయి నందమూరి బాలకృష్ణ గారి పుట్టిన రోజున జరుపుకున్నాం. రెండో ఈవెంట్ నేను మిత్రుడిగా భావించే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్ డే సందర్భంగా జరుపుకోవడం జరిగింది. అక్కినేని నాగార్జున గారు నాలో ప్రతిభని గుర్తించి దర్శకుడిగా జన్మనిచ్చారు. ఆయన నాకు గాడ్ ఫాదర్. ఆయన బర్త్ డేని పురస్కరించుకోని ఈ మూడో వేడుక జరుపుకోవడం ఆనందంగా వుంది.

Nagarjuna: రజనీ సినిమాలో నాగ్.. లుక్ నెక్స్ట్ లెవెల్ గురూ

నాగార్జున గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. నాగార్జున గారు, హరికృష్ణ గారిని కలిపి సీతారామరాజు సినిమా తీయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. యాదృచ్ఛికంగా హరికృష్ణ గారి వర్ధంతి నేడు కావడం బాధకరం. హరికృష్ణ గారికి అంజలి ఘటిస్తున్నాను. ఆయన నా మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారు. నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. సృష్టిలో ప్రతి శబ్దాన్ని అక్షర రూపంలో రాగలిగే భాష తెలుగు. తెలుగు భాషా దినోత్సవం రోజున ఈ వేడుక జరుపుకోవడం ఆనందంగా వుంది. ఈ వేడుక ఒక్క ముఖ్య ఉద్దేశం.. ఈ సినిమా కథా నేపధ్యం ప్రకటించడం. 1980 నేపథ్యంలో ఈ కథ జరగబోతోంది. ఈ నేపథ్యం బలీయమైన తెలుగు భాష, సంస్కృతి, తెలుగు జాతి నేపథ్యం ఇది. తెలుగు భాషా, సంస్కృతి, విలువలు గురించి చెప్పాలని ఎప్పటినుంచో భావిస్తున్నాను. సందేశంలా కాకుండా మంచి వాణిజ్య విలువలు వున్న అంశాలు వున్నప్పడే ఇలాంటి కథ చెయ్యాలి. అలాంటి వాణిజ్య విలువలు అన్నీ కుదిరిన కథ ఇది. తెలుగు భాషా దినోత్సవం రోజున, గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మదినం పురస్కరించి ఈ నేపధ్యం ప్రకటించడం చాలా ఆనందంగా వుంది. ఇందులో కొన్ని సన్నివేశంలో భావోద్వేగాలని పద్యరూపంలో కూడా ప్రకటించడం జరుగుతుంది. ఇది తెలుగు భాషకు ఇస్తున్న ఒక జ్ఞాపిక లాంటి ప్రక్రియ. చాలా కష్టపడి పని చేస్తాం. మీ అందరికీ నచ్చేలా చేస్తాం’ అన్నారు