Site icon NTV Telugu

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్.. ఆస్కార్ బరిలో ఎన్టీఆర్..?

Ntr

Ntr

NTR: నందమూరి తారక రామారావు.. ఈ పేరు వింటేనే తెలుగు ప్రజల్లో ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆయన పేరుతో పాటు నటనను కూడా పుణికిపుచ్చుకొని తాత పేరు నిలబెడుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తారక్ నటన గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆర్ఆర్ఆర్ కు ముందు.. ఆ తరువాత అని చెప్పుకోవచ్చు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ అని లేకుండా ప్రతి ఒక్క అభిమాని ఎన్టీఆర్ నటన అద్భుతమని ప్రశంసించినవారే. బీభత్సం, రౌద్రం, ప్రేమ, కరుణ ఒకే పాత్రలో చూపించి ఇండియాలోనే ది బెస్ట్ నటుడు అని అనిపించుకున్నాడు.

ఇక ఈ నటనకు గాను ఎన్టీఆర్ కు ఆస్కార్ ఇచ్చినా తప్పులేదు అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి ఆస్కార్ బరిలో ఉత్తమ నటుడు కేటగిరిలో ఎన్టీఆర్ ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ మూవీ పబ్లికేషన్ వెరైటీ.. ఈ విషయాన్ని ప్రకటించింది. ఆస్కార్ 2023 నామినేషన్ లో ఎన్టీఆర్ ఉండే అవకాశాలు ఉన్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వార్త నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరవేసే వార్త అని చెప్పొచ్చు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆస్కార్ కు ఎంపిక అయిన హీరో ఎన్టీఆర్ ఒక్కడే అవుతాడు. అది నిజంగా గర్వకారణమే అని చెప్పాలి. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version