Site icon NTV Telugu

Khel Khatam Darwajaa Bandh: ‘ఏదో ఏదో..’ అయ్యేట్టుందే !

Yedo Yedo

Yedo Yedo

రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నసినిమా “ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్”. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. “ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్” సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ మూవీ నుంచి ‘ఏదో ఏదో..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

‘ఏదో ఏదో..’ రిలికల్ సాంగ్ కు పూర్ణాచారి క్యాచీ లిరిక్స్ అందించగా, సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. కార్తీక్, హరిణి మంచి ఫీల్ తో పాడారు. ‘ఏదో ఏదో..’ సాంగ్ ఎలా ఉందో చూస్తే…’ఏదో ఏదో ఏదో జరిగెనే యెద లోపలా, ఏవో ఏవో కలలు విరిసెనే, నిన్నా మొన్నా లేదే అరే ఏంటిలా, ఉన్నట్టుండి ముంచేశావిలా, మనసే ముసుగులు తీసే, అడుగులు వేసే బయటకు నీతోనే, కలిసే నిమిషం వణికే, పెదవులు పలికే తకధిమి తందానే…’ అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.

Exit mobile version