Site icon NTV Telugu

Toxic : కియార కోసం.. ‘టాక్సిక్‌’ మూవీ సెట్స్‌ ముంబైకి షిఫ్ట్‌ చేసిన యష్..

Yash Toxic Movie

Yash Toxic Movie

‘కేజీఎఫ్‌’ సిరీస్‌ ద్వారా దేశవ్యాప్తంగా  అభిమానులను సంసాదించుకున్న కన్నడ స్టార్ యష్.. తన కొత్త ప్రాజెక్ట్‌ ‘టాక్సిక్’ కోసం మరింత ఆసక్తికరంగా ప్రిపేర్ అవుతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా, ఇప్పటికే యష్ బర్త్‌డే స్పెషల్‌గా విడుదలైన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ లభించింది.ఈ సినిమాలో  హీరోయిన్‌గా  బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ కూడా నటిస్తున్నారు. అయితే చిత్ర షూటింగ్ మొదలైన కొద్దికాలానికే కియారా గర్భవతిగా మారిన విషయం తెలిసిందే.

Also Read : Ye Maaya Chesave : ‘ఏ మాయ చేసావే’ ప్రమోషన్‌లో నేను లేను.. సమంత క్లారిటీ

అయితే గర్భవతిగా ఉన్న కియారాకు షూటింగ్ షెడ్యూల్ సులభంగా ఉండాలనే ఉద్దేశంతో, యష్ తన భాగమైన కొన్ని ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్‌ను, బెంగళూరులో కాకుండా, ముంబైకి మార్చాలని నిర్ణయించారట. దీంతో ఆమెకు ప్రయాణ బాధ్యత తగ్గింది. ముంబైలోనే యష్ – కియారా‌ల మధ్య సన్నివేశాలను, త్వరగా షూట్ చేసి పూర్తి చేశారట. ఈ విషయం బయటకు వచ్చాక, యష్ సెన్సిటివిటీ, సహనభావం చూసిన ప్రేక్షకులు, అభిమానులు ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక నటీమణి ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని, షూటింగ్ లొకేషన్ మార్చడం నిజంగా అరుదైన విషయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది.

Exit mobile version