Site icon NTV Telugu

Nandamuri Mokshagna : జూనియర్ నటసింహం నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్..

Untitled Design (4)

Untitled Design (4)

నందమూరి బాలయ్య ఒకవైపు వరుస సినిమాలు, టాక్ షోస్ తో హల్ చల్ చేస్తున్నాడు. బాలయ్య ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇటీవల 50 ఏళ్లు పూర్తి అయ్యాయి. కాగా బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ కూడా  ఎంతగానో ఎదురు చూస్తోంది. ఒకపక్క మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం స్టార్ హీరోగా ఎదగడం చకచక జరిగాయి. మరొక స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య, అఖిల్ టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. దీంతో బాలయ్య కొడుకు ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని చాలా కాలంగా చర్చ నడిచింది.

Also Read: CommitteeKurrollu : కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎక్కడంటే..?

వాస్తవానికి నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. ఇన్నాళ్లకు బాలయ్య వారసుడు ఎంట్రీ ఫిక్స్ అయింది. హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వెండితెరకు పరిచయం కాబోతున్నాడు మోక్షజ్ఞ. ఈ రోజు మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. క్యూట్ లుక్ లో సింపుల్ గా నడుచుకుంటూ చిన్న సింహం మాదిరి కనిపిస్తున్న మోక్షజ్ఞ లుక్ అదరగొట్టింది అని చెప్పాలి. మోక్షు ఫస్ట్ లుక్ తో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పురాణ ఇతిహాసాల నేపథ్యంలో ఈ చిత్ర కథాశం ఉండబోతున్నట్టు సమాచారం. SLV బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి మరియు బాలయ్య చిన్న కుమార్తె మతుకుమిల్లి తేజస్విని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Exit mobile version