మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సిల్వర్ స్క్రీన్ కు పరిచయమయ్యాడు కొణిదెల పవన్ కళ్యాణ్. తన నటనతో ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించి పవర్ స్టార్ గా అభిమానులను అలరిస్తూ, తెలుగు సినిమా రికార్డులు తిరగరాసాడు పవర్ స్టార్. మరోవైపు తనని ఇంతటి వాడిని చేసిన తెలుగు ప్రజల కోసం రాజకీయాలలో అడుగుపెట్టి నాటి పాలకుల పొగరు అణిచి, నేడు పేదవాడికి పక్షాన ప్రజా పరిపాలనాలో భాగస్వామ్యుడుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పదవినలంకరించి సామాన్యుడికి తోడు, నీడగా సాగుతూన్న జనసేనాని 56వ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ జీవితం అనే పుస్తకాన్ని ఒకసారి తిరగేసి చుస్తే..
సినీరంగ ప్రవేశం :
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమా హిట్ తో వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత వరుసగా గోకులంలో సీత, సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషి వంటి సూపర్ హిట్స్ తో పవన్ కళ్యాణ్ కాస్త పవర్ స్టార్ గా మారాడు. కెరీర్ తొలినాళ్లలో వరుసగా 6 సూపర్ హిట్స్ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసాడు పవర్ స్టార్. ఖుషి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను తారస్థాయికి చేర్చింది. ముఖ్యంగా కుర్రకారు పవన్ పేరు చెబితేనే ఉగిపోయేవారు. అలా సాగుతున్న పవన్ సినీ కెరీర్ లో ఖుషి తర్వాత దాదాపు 11 సంవత్సరాలు హిట్ అనేది లేదు. ఇక పవన్ కళ్యాణ్ పని అయిపోయింది, అయన హిట్ సినిమా ఇవ్వడం అనేది జరిగేపని కాదు అని విమర్శలు వచ్చాయి. సరిగ్గా అప్పడే వచ్చింది ‘గబ్బర్ సింగ్’. విమర్శలు చేసిన వాళ్ళ నోరు మూపిస్తూ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసి పవర్ స్టార్ పవర్ ఏంటో చూపించాడు పవన్ కళ్యాణ్..
రాజకీయరంగా ప్రవేశం :
సినిమా రంగంలో శిఖరాగ్రాలను అధిరోహించిన పవన్ కళ్యాణ్, తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో మొట్టమొదటి సారి రాజకీయలలో అడగుపెట్టారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడం, విలీనంతో కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పేదవాడికి పట్టెడన్నం కూడా పెట్టలేని ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు, ప్రజల తరపున పోరాడే గొంతుకను వినిపించేందుకు 2014లో జనసేన పార్టీ స్థాపించి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. ఆ ఎన్నికల్లో టీడీపీ పార్టీకి మద్దతుగా నిలిచి ప్రభుత్వ స్థాపనకు తన వంతు పాత్ర పోషించాడు. ఆ తర్వాత కొన్నేళ్ళకు మద్దతు ఉపసంహరించుకోవం చకచక జరిగిపోయాయి.
ఎన్నికల్లో పోటీ – ఘోర ఓటమి :
2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ సొంతగా పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడంతో ఎన్నడూ లేని విమర్శలు ఎదుర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులు తన వ్యక్తిగత జీవితాన్ని విమర్శించినా తానూ జవాబుదారిగా వ్యవహరించాల్సింది ప్రజలకు మాత్రమే అని నమ్మి విమర్శలకు క్రుంగిపోకుండా పడిలేచిన కెరటం లాగ కష్టాలను, ఒడిదుడుకులను పంటిబిగువున పట్టిఉంచి, మొక్కొవోని దీక్ష పూని, ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు సామాన్యుడి కోసం అధికార పార్టీ అరాచకాలపై పోరాడి, ప్రభుత్వం అంటే అధికారాన్ని చలాయించడం కాదు ప్రజలకు జవాబుదారిగా ఉండడం అని చెప్పడంతో పాటు ఆంధ్ర ప్రజల బానిస సంకెళ్లును తెంచేందుకు భీమ్లా నాయక్ లా గర్జించాడు.
విజయం – బాధ్యతలు :
2024 ఎన్నికల్లో ఊహించని మెజారిటీతో పిఠాపురం జనసేన ఎమ్మెల్యేగా గెలిచి, తన పార్టీ అభ్యర్ధులను గెలిపించి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో అడుగుపెట్టి ప్రభుత్వ ఏర్పాటులో ముందుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా పదవీ భాద్యతలు చేపట్టి, సామాన్యుడికి అండగా ప్రజలకు ఓ తమ్ముడిగా, విమర్శకులకు ఓ గబ్బర్ సింగ్ గా, ప్రతిపక్ష నాయకులకు ఓ బద్రిగా, ఆడపిల్లలకు రక్షణ కోసం ఓ వకీల్ సాబ్ గా, ప్రచార ఆర్బాటాలను కోరుకొని అజ్ఞాతవాసిగా, ఆంధ్రప్రజలకు బంగారం లాంటి నాయకుడుగా, అవినీతి అధికారులపై కొమురం పులిలా పంజా విసురుతూ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న జనాలు మెచ్చిన జనసేనానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.