పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
కాగా ఈ సినిమాకు ఆంధ్రలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది అక్కకి కూటమి ప్రభుత్వం. సింగిల్ స్క్రీన్స్ లో లోయర్ క్లాస్ రూ. 100 అప్పర్ క్లాస్ లో రూ. 150 పెంచారు. మల్టిప్లెక్స్ లో రూ. 200 పెంచుతూ జీవో జారీ చేసారు. ఈ లెక్కన సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ధర రూ . 297 అవుతుంది. మల్టిప్లెక్స్ లో రూ. 377 అయింది. అయితే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కూడా ఏపీలో ఇవే ధరలు ఉన్నాయి. అలాగే పుష్ప 2 కు ఏ స్థాయిలో థియేటర్స్ కేటాయించారో ఏపీ వ్యాప్తంగా హరిహర వీరమల్లు కు అంతే స్థాయిలో కేటాయింపులు జరుగుతున్నాయి. దాంతో ఇప్పుడు ఆంధ్ర వరకు అల్లు అర్జున సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాటుతాడా అని చర్చ ట్రేడ్ వర్గాల్లో నడుస్తోంది. హరిహర కు టికెట్ రేట్లు పెంపుతో పాటు ప్రీమియర్ టికెట్ ధరను రూ. 600 ఫిక్స్ చేసింది. బ్రో సినిమా తర్వాత రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న పవర్ స్టార్ ఐకాన్ స్టార్ ను బీట్ చేస్తాడో లేదో
