NTV Telugu Site icon

Dua Padukone: హిందూ పేరు దొరకలేదా? ఈ దువా ఎందుకు?

Deepiaka Padukone Ranveer S

Deepiaka Padukone Ranveer S

రణవీర్ సింగ్, దీపికా పదుకొణె తమ కుమార్తెకు ‘దువా’ అని పేరు పెట్టడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హిందూ తల్లిదండ్రులు తమ కుమార్తెకు ఇస్లామిక్ పేరు పెట్టడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకొణెల కూతురు పేరు ‘దువా’ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా అవుతొంది. దీపావళి వేడుకల్లో తమ ముద్దుల కూతురు లేత పాదాల ఫోటోను షేర్ చేసిన రణవీర్-దీపిక, మా ప్రార్థనల ఫలితంగా ఆమె పుట్టింది. అందుకే ఆమెకు దువా అని పేరు పెట్టారు. అంతే కాదు ముందుగా కూతురి పేరుతో పాటు తల్లి ఇంటి పేరును జత చేయడం అభిమానులకు నచ్చింది. సాధారణంగా పిల్లల పేర్లతో తండ్రి పేరు పెడతారు.

Guess The Celebrity: ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. ఎవరో చెప్పుకోండి చూద్దాం

కానీ ఈ స్టార్ కపుల్ పాపకు తల్లితండ్రులు ఇద్దరి ఇంటిపేర్లు కలిసేలా ‘దువా పదుకొనే సింగ్’ అని పేరు పెట్టారు. అయితే నిజానికి ‘దువా’ అనేది ఇస్లాం టర్మ్. [ప్రార్ధనను వారు దువా అని వ్యవహరిస్తారు. ఈ క్రమంలో హిందూ తల్లితండ్రులయిన మీకు ఇంకా ఏ పేరు నచ్చలేదా? కుమార్తెకు ప్రార్థన అని ఎందుకు పేరు పెట్టలేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రార్థన లేదా మరేదైనా హిందూ పేరు పెట్టడానికి మీకు మనసొప్పలేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై ఈ కపుల్ అభిమాని ఒకరు స్పందిస్తూ, తమ కుమార్తెకు పేరు పెట్టడం తల్లిదండ్రుల నిర్ణయం అని అన్నారు. ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని ఆయన అంటున్నారు. ఇప్పుడు అవసరమైతే దువాతో పాటు ‘ఖాన్’ అని కూడా పెట్టండి. కుమార్తెకు ఇస్లాం అని పేరు పెట్టారు. ఇప్పుడు మీరిద్దరూ మీ పేరును మొహమ్మద్, అయేషాగా మార్చుకోండి అంటూ దువా ఫోటోకు వందల సంఖ్యలో కామెంట్స్ రావడం హాట్ టాపిక్ అవుతుంది.