కోలీవుడ్ రూమర్డ్స్ కపుల్ విజయ్ అండ్ త్రిష కలిసి కనిపిస్తే నెటిజన్స్‌కు పండుగే. రీసెంట్లీ లండన్ రేసింగ్ ఈవెంట్‌లో సందడి చేసింది ఈ జోడీ. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. కానీ ఓ వీడియో విజయ్ ఫేస్ తిప్పుకోవడాన్ని ట్రోల్ చేసేస్తున్నారు. త్రిష గత కొద్దినెలలుగా తమిళనాట ట్రెండింగ్లో నిలుస్తుంది. ప్రొఫెషనల్ లైఫ్ కన్నా పర్సనల్ లైఫ్ పరంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ న్యూస్ మేకర్ అయ్యింది. తమిళనాడు సీఎం విజయ్‌తో స్ట్రాంగ్ ఎఫైర్ రూమర్స్ నేపథ్యంలో ఎప్పుడు ఈ ఇద్దరు కనిపించినా మీడియాకు ఇటు సోషల్ మీడియాకు కావాల్సినంత స్టఫ్ దొరికేస్తుంది.
తాజాగా యూకేలో జరిగిన కార్ రేసింగ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు విజయ్. అజిత్‌తో కలిసి కనిపించడం ఫ్యాన్స్ ఫెస్టివల్ చేసుకుంటున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించే సరికి ఉబ్బితబ్బిబ్బు అయిపోయారు. కానీ ఇంతలో త్రిష కూడా ఈవెంట్లో ప్రత్యక్షం కావడం మరింత డిస్కర్షన్‌కు కారణమైంది. ఓ వీడియోలో విజయ్ కార్ రేసింగ్ చూస్తుండగా.. సడెన్లీ ఫ్రేమ్‌లోకి ఎంటరైంది త్రిష. కానీ అంతలో ఫేస్ టర్న్ చేసుకున్నాడు విజయ్. దీంతో ట్రోలర్స్‌కు పని కల్పించింది ఈ జోడీ. ముఖ్యమంత్రి కాక ముందే ఓ వివాహనికి త్రిషతో కలిసి బహిరంగంగా వెళ్లినప్పుడు లేని హైడ్.. ఇప్పుడెందుకు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. గతంలో ఓ టెక్ కంపెనీ సీఇవో వీడియోను ఎగ్జాంపుల్‌గా చూపిస్తూ.. సేమ్ సేమ్ బట్ డిఫరెంట్ అంటూ ఆడేసుకుంటున్నారు. విజయ్, అజిత్ కలిసాడన్న హ్యాపీనెస్ త్రిష చంపేసిందంటూ సెటైర్స్ పేలుస్తున్నారు.

