What are Puri Jagannadh Future Plans : పూరి జగన్నాథ్ ఒకప్పుడు తెలుగులో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు అందించాడు. మధ్య మధ్యలో ఫ్లాపులు పడ్డా తిరిగి నిలబడి పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగు సినీ పరిశ్రమకు అందించాడు. అయితే ఆయన నుంచి చివరిగా వచ్చిన రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ముందుగా వచ్చిన లైగర్ సినిమా ఆయనను భారీ నష్టాలపాలు చేయగా ఈ మధ్యకాలంలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆ నష్టాలను డబుల్ చేసింది. ఇప్పుడు పూరీ జగన్నాథ్ పరిస్థితి ఏమిటి? ఆయన తరువాత ఏ హీరోతో సినిమా చేస్తాడు అనేది అంతు పట్టకుండా మారిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలతో సినిమాలు చేసిన ఆయనతో ఇప్పుడు వాళ్లు ఎవరూ సినిమాలు చేయడానికి రెడీగా లేరు.
ViswamTeaser : విశ్వంతో శ్రీనువైట్ల విశ్వరూపం చూపిస్తాడు : గోపించంద్
మిగతా వాళ్ళందరూ పాన్ ఇండియా రేస్ లో దూసుకుపోతుంటే పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు పూరీ జగన్నాథ్ కి ఉన్న ఆప్షన్ ఏదైనా ఉందంటే అది యంగ్ హీరోస్ సాయిధరమ్ తేజ్ విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జా వంటి వాళ్లతోనే సినిమాలు చేయాల్సి ఉంటుంది. వాళ్లు కూడా ఇప్పుడు పూరీ జగన్నాథ్ తో సినిమా అంటే చేస్తారా? లేదా? అనేది అనుమానమే. అయితే బాలకృష్ణ మాత్రం పైసా వసూల్ లాంటి సినిమా ఇచ్చిన తర్వాత కూడా పూరీ జగన్నాథ్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ ఇప్పుడు చేస్తున్న సినిమా పూర్తి అయిన వెంటనే బోయపాటితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. తర్వాత కొడుకుని హీరోగా లాంచ్ చేస్తున్న సినిమాని కూడా పర్యవేక్షించాలి కాబట్టి ఇప్పుడు పూరితో సినిమా చేయడం కష్టమే. మరి పూరి తర్వాతి సినిమా ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తేజ సజ్జాను పూరి టీం సంప్రదించినట్టు ప్రచారం జరుగుతోంది కానీ తేజ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.