NTV Telugu Site icon

War 2 : ‘వార్ 2 ‘ షూటింగ్ పిక్స్ లీక్.. వైరల్ అవుతున్న హృతిక్, ఎన్టీఆర్ లుక్..

Whatsapp Image 2024 04 17 At 12.14.16 Pm

Whatsapp Image 2024 04 17 At 12.14.16 Pm

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వార్ 2’.ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు.యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వార్ 2 సినిమా రూపొందుతుంది.ఇప్పటికే వార్ 2 సినిమా షూటింగ్ స్టార్ట్ అయి శరవేగంగా షూటింగ్ జరుగుతుంది .రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యారు.తాజా షెడ్యూల్ లో ఎన్టీఆర్ అండ్ హృతిక్ కాంబోలో వచ్చే సీన్స్ ని మేకర్స్ చిత్రీకరిస్తున్నారు.అయితే తాజాగా ఈ షూటింగ్ సెట్స్ నుంచి రెండు ఫొటోలు నెట్టింట లీక్ అయ్యాయి. ఆ పిక్స్ లో హృతిక్ అండ్ ఎన్టీఆర్ కనిపిస్తున్నారు.

హృతిక్ బులెట్ జాకెట్ ధరించి టీ తాగుతూ కనిపిస్తుంటే.. ఎన్టీఆర్ బ్లాక్ టి-షర్ట్ లో నడుస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ లీక్డ్ పిక్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి . ప్రస్తుతం ఎన్టీఆర్,హృతిక్ మధ్య యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం .ఇదిలా ఉంటే ఈ లీక్డ్ పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ నెట్టింట తెగ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువ సమయం మాత్రమే ఉండనున్నట్లు సమాచారం.వార్ 2 లో ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన సీన్స్ చిత్రీకరించడం కోసం ఎన్టీఆర్ 60 రోజుల డేట్స్ ని కేటాయించారని సమాచారం. కాగా వార్ 2 సినిమా ని వచ్చే ఏడాది ఆగస్టు లో రిలీజ్ చేయనున్నారు .ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి నటిస్తున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది .

Show comments