NTV Telugu Site icon

Waltair Veerayya: మెగాస్టార్ సినిమాలో మాస్ మహారాజా లుక్ అవుట్

Raviteja

Raviteja

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ‘వాల్తేర్ వీరయ్య’లో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 2023 సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమా నుంచి రవితేజ లుక్ తో పాటు టీజర్ ను విడుదల చేశారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సాగర్ ఏసీపీగా రవితేజ లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. రవితేజను ఎలా ఎలివేట్ చేయాలో అతనితో సినిమా చేసి ఉన్న బాబీకి తెలిసి ఉండటంతో ఆయన ఫ్యాన్స్ కిర్రెక్కి పోతున్నారు.

‘కారులో మేక పిల్లతో దిగి ఫైట్ చేసి ‘ఏమ్రా వారి… పిస పిసా చేస్తున్నావ్… నీకింకా సమజ్ కాలే… నేను ఎవ్వనయ్యకి విననని..’ అంటూ వార్నంగ్ ఇచ్చిన రవితేజ డైలాగ్ కి ఈలలు పడిపోతున్నాయి. ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు రామ్-లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేశారు. ‘పవర్’ తర్వాత రవితేజను మరో పవర్-ప్యాక్డ్ పాత్రలో చూపిస్తున్నాడు బాబి. దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్ ను మరింత ఎలివేట్ చేసింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం యూరప్‌లో వీరిద్దరిపై పాటల చిత్రీకరణ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి జికె మోహన్ సహ నిర్మాత.