NTV Telugu Site icon

Vishwambhara : ఇంకా చెక్కుతున్నారు బాసూ.. మరో మెగా హీరో కూడా?

Vishwambhara Teaser

Vishwambhara Teaser

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’. బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ లో యువీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి జోడీగా స్టార్ హీరోయిన్‌ త్రిష, ఆషిక రంగనాథ్ నటిస్తున్నారు. ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నామని గతంలో ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. అయితే దసరా సమయంలో మాత్రం అప్పుడు చేయడం లేదని, సినిమా అంతా రెడీగా ఉన్నా గేమ్ ఛేంజర్ కోసం వాయిదా వేస్తున్నామని చెప్పారు.

Jaggery: చక్కెర కంటే బెల్లం ఆరోగ్యానికి మంచిదా?

అయితే ఇప్పుడు ఈ సినిమాను ఇంకా చెక్కుతున్నారు. తాజాగా ఈ సినిమాలో ఓ అతిథి పాత్రను సాయి దుర్గా తేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో మామా అల్లుళ్ళ మీద సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. చిరంజీవి మీద శోభి మాస్టర్ కొరియోగ్రఫీలో ఇంట్రడక్షన్ సాంగ్ తీస్తున్నారు, బహుశా… ఆ పాటలో మామా అల్లుళ్ళు సందడి చేసే అవకాశం ఉందని అంటున్నారు. విశ్వంభర చిత్రాన్ని దాదాపు రూ.200 కోట్ల భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు. ఎన్నో అంచనాలు నెలకొన్న చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.