NTV Telugu Site icon

Vishwak Sen: మళ్ళీ చెక్కుతున్నారట!

Vishwaksen

Vishwaksen

Vishwak Sen Mechanic Rocky Busy in Re shoots: విశ్వక్సేన్ హీరోగా నటించిన చాలా సినిమాలు ముందు అనౌన్స్ చేసిన డేట్ కంటే లేటుగా రిలీజ్ అయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఆయన హీరోగా వచ్చిన చివరి సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా ప్రకటించిన డేట్ నుంచి 8 నెలల ఆలస్యంగా వచ్చింది. మూడుసార్లు రిలీజ్ డేట్ లు మార్చారు. అయితే ఇప్పుడు ఆయన ప్రేక్షకుల ముందుకు మెకానిక్ రాఖీ అనే సినిమాతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితం పూర్తయింది. అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఆరోజు కూడా రిలీజ్ అవ్వడం లేదని తెలుస్తోంది. నవంబర్ నెలలో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఎందుకంటే ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ చాలా కష్టపడ్డాడు.

Tollywood : టు డే టాప్ – 10 సినిమా న్యూస్..

అయితే ఫైనల్ కట్ చూసిన తర్వాత కొన్ని ఎపిసోడ్స్ అంతగా బాగా రాలేదని మేకర్స్ ఫీలయ్యారట. అందుకే మళ్ళీ రీ షూట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదారాబాద్ సిటీలో వేసిన మెకానిక్ షెడ్ లో సినిమాకి సంబంధించిన రీషూట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ నైట్ షిఫ్ట్ షూటింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా వాయిదా పడిన సంగతి ఇంకా అనౌన్స్ చేయలేదు. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రవితేజ ముళ్ళపూడి ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నాడు. ఇక మీనాక్షి చౌదరి ఈ సినిమాలో విశ్వక్సేన్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. రామ్ తాళ్లూరి ఎస్ఆర్టి ఎంటర్ప్రైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జెక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద విశ్వక్ సేన్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. కచ్చితంగా హిట్టు కొడతానని నమ్ముతున్నాడు.

Show comments