మాస్ కా దాస్ నటించిన లేటెస్ట్ సినిమా లైలా నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కోసం తొలిసారి లేడీ గెటప్ వేసాడు విశ్వక్ సేన్. ఈ సంగతి అలా ఉంచితే రాబోయే ఓ సినిమాలో విశ్వక్ సేన్ నటించడం లేదు అనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్ సూపర్ హిట్ అయింది. ఇక హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో భాగంగా నాని హీరోగా హిట్ : ది థర్డ్ కేస్ వస్తుంది.
Also Read : Laila : లైలా ట్విట్టర్ రివ్యూ..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన నాని అర్జున్ సర్కార్ లుక్ అదిరిపోయింది. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌లో ఓ మాస్ హీరో ఎంట్రీ ఉంటుందని అది బాలయ్య అని కూడా టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంత అనేది పక్కన పెడితే హిట్ 3లో మాత్రం నానితో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు కనిపిస్తారని తెలుస్తోంది. వాళ్లేవరో కాదు హిట్ ఫస్ట్ కేస్ హీరో విశ్వక్ సేన్, హిట్ సెకండ్ కేస్ హీరో అడివి శేష్ కామియో రోల్‌లో కనిపించనున్నారట. కథలో భాగంగానే ఈ ఇద్దరు నానికి సపోర్ట్‌గా ఇన్విస్టిగేషన్‌కు హెల్ప్ చేసే ఛాన్స్ అయితే ఉందని సమాచారం. కానీ అందుతన్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి విశ్వక్ సేన్ తప్పుకున్నారట.హిట్ ఫస్ట్ కేస్ లోని కొంత ఫుటేజ్ తో మ్యానేజ్ చేస్తారట. మొత్తనికి హిట్ సినిమా ఫ్రాంచైజ్ నుండి విశ్వక్ సేన్ తప్పుకున్నాడు.