Site icon NTV Telugu

Tollywood: డబ్బు ఇవ్వకపోతే నెగటివ్ రివ్యూలు.. యూట్యూబర్ పై నిర్మాత పోలీస్ కంప్లైంట్

Police

Police

రాజ్ గురు ఎంటర్టైన్మెంట్స్ గ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ దర్శకత్వంలో జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జర్నీఫర్, రోనిత్, అన్షుల, బబ్లు, కౌశల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అయితే ప్రేక్షక ఆదరణతో ఈ సినిమా బృందం సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమక్షంలో కేక్ కటింగ్ తో చిత్ర బృందం వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దారపునేని రాజా మాట్లాడుతూ… నిన్న సిటీలోని వేరు వేరు థియేటర్లకు వెళ్లినప్పుడు అక్కడ ప్రజాదరణ చూసి ఎంత సంతోషం వేసింది. అయితే ఇంత గొప్ప ఆదరణ పొందుతున్న సినిమాపై కొంతమంది మీడియా ముసుగులో విషం జల్లుతున్నారు.

Also Read:Allu Arjun vs Rashmika: అప్పుడు ‘శ్రీవల్లి వైఫ్ ఆఫ్ పుష్పరాజ్’.. ఇప్పుడు ‘పుష్పరాజ్ వర్సెస్ శ్రీవల్లి’!

మేము థియేటర్లలో చూసినప్పుడు ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగా నచ్చిందో స్వయంగా అర్థమైంది. కానీ పూల చొక్కా నవీన్ లాంటివారు మా సినిమా నుండి డబ్బులు డిమాండ్ చేసి అవి ఇవ్వకపోయేప్పటికి మాపై పగ పట్టి మా సినిమాను ప్రేక్షకులలో నెగిటివ్ చేసేందుకుగాను వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కావాలని మా సినిమా ఇమేజ్ డామేజ్ చేసే విధంగా రివ్యూలు ఇస్తున్నారు. అలాగే మరికొందరు యూట్యూబ్ ఛానల్స్ సినిమా విడుదలకు ముందే సినిమాలపై నెగిటివ్గా రివ్యూలు ఇచ్చి ప్రేక్షకులను తప్పుదారి పట్టిస్తున్నారు. వారిపై ఇప్పటికే ఫిలిం చాంబర్లో కంప్లైంట్ చేశాము. లీగల్ గా కూడా వారిపై చర్యలు తీసుకుంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. దయచేసి ప్రేక్షకులు అటువంటి వాడి రివ్యూలను నమ్మి మోసపోకండి” అన్నారు.

Exit mobile version