Site icon NTV Telugu

Vilaya Tandavam: ‘విలయ తాండవం’ మొదలైంది!

Vilaya Thandavam

Vilaya Thandavam

కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1 గా మండల ధర్మ రావు, గుంపు భాస్కరరావు ‘విలయ తాండవం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను బుధవారం (అక్టోబర్ 1) నాడు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమానికి ఆకాష్ పూరి, భీమనేని శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

Also Read : Ram Talluri: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా టాప్ ప్రొడ్యూసర్..!

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కార్తీక్ రాజు మాట్లాడుతూ .. ‘ప్రస్తుతం కంటెంట్ ఉన్న చిత్రాలనే జనాలు ఆదరిస్తున్నారు. మంచి కాన్సెప్ట్ ఉంటేనే జనాలు థియేటర్లకు వస్తున్నారు. డైరెక్టర్ వాసు సరికొత్త పాయింట్, కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్ వచ్చాక అందరూ ఆశ్చర్యపోతారు. ఈ మూవీలో నేను, పార్వతి, జగదీష్ చాలా ముఖ్యమైన పాత్రల్ని పోషించాం. నిర్మాతలైన ధర్మా రావు, గుంపు భాస్కర రావు నాకు ఫ్యామిలీ మెంబర్లలా మారిపోయారు. ఈ మూవీతో మా అందరికీ పెద్ద విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Exit mobile version