NTV Telugu Site icon

Vikatakavi: వెబ్ సిరీస్‌కు వ‌ర్క్ చేయ‌టం ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్ : జోశ్యుల‌ గాయ‌త్రి

Sweety

Sweety

నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి వికటకవి వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో త‌న వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి కాస్ట్యూమ్ డిజైన‌ర్ జోశ్యుల గాయ‌త్రి దేవి ఇంట‌ర్వ్యూ

* ఫ్యాష‌న్ డిజైన‌ర్‌గా ఎలా మారారు?

– జాబ్ రిజైన్ చేసిన త‌ర్వాత బ్రేక్ తీసుకుందామ‌ని అనుకున్నాను. ఆ స‌మ‌యంలోనే ఫ్యాష‌న్ డిజైనింగ్‌లో జాయిన్ అయ్యాను. ఫ్యాష‌న్ షో మెంట‌ర్‌గా వ‌ర్క్ చేశాను. నా ద‌గ్గ‌ర 7 టీమ్స్ ఉండేవి. త‌ర్వాత నేనే సొంతంగా బోటిక్ బిజినెస్ స్టార్ట్ చేశాను.

* సినీ ఇండ‌స్ట్రీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు?

– రెగ్యుల‌ర్‌గా ఇత‌ర డిజైన‌ర్స్ వ‌చ్చి నా ద‌గ్గ‌ర స్టిచింగ్ చేసుకుని వెళుతుండేవారు. అలా మెల్ల‌గా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాను. ప‌లాస మూవీకి నేను డిజైనింగ్ మాత్ర‌మే చేసిచ్చాను.షూట్‌కి వెళ్ల‌లేదు. అయితే ఆహా వాళ్లు చేసిన కుడిఎడ‌మైతే వెబ్ సిరీస్ ద్వారా కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా నా కెరీర్ ఇక్క‌డ స్టార్ట్ అయ్యింది. త‌ క‌ళాపురం సినిమాకు వ‌ర్క్‌చేశాను. త‌ర్వాత

* సినిమాలు..సిరీస్‌లు.. రెండింటికి వ‌ర్క్ చేయ‌టంలో ఉన్న వ‌త్యాసం ఏంటి?

– సిరీస్‌ల‌కు వ‌ర్క్ చేసే స‌మ‌యంలో బ‌డ్జెట్‌కు సంబంధించిన ప‌రిమితులుంటాయి. త‌క్కువ బ‌డ్జెట్‌లో ఎక్కువ ఔట్‌పుట్ ఎదురు చూస్తారు. అయితే సినిమాల విష‌యానికి వ‌చ్చే స‌రికి బ‌డ్జెట్ విష‌యంలో కాస్త వెసులుబాటు ఉంటుంది. సిరీస్‌ల‌కు వ‌ర్క్ చేసేట‌ప్పుడు డైరెక్ట‌ర్‌తో పాటు ఓటీటీల‌కు సంబంధించిన ఇన్‌పుట్స్ చాలానే ఉంటాయి. కానీ సినిమాల్లో మాత్రం డైరెక్ట‌రే ఫైన‌ల్ డిసిష‌న్ మేక‌ర్‌.

* ‘వికటకవి’ సిరీస్ వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి?

– విక‌ట‌క‌వి సిరీస్ తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కింది. 1940 స‌మ‌యంలో హైద‌రాబాద్ ఎలా ఉండిందో ముందు నేను తెలుసుకోవాల‌నుకుంటున్న స‌మ‌యంలో మా అసోసియేట్స్ ఏం చెప్పారంటే ‘మాభూమి’ అనే తెలంగాణ మూవీని చూడ‌మ‌న్నారు. టెక్నీషియ‌న్స్‌గా ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది.

* ‘వికటకవి’లో మీకు చాలెంజింగ్‌గా అనిపించిందేంటి?

– ఫ్యాబ్రిక్స్ విష‌యంలో చాలా కేర్ తీసుకోవాలి.. ముందు మేం అనుకున్నది వేరు. కానీ క‌థ‌కు త‌గ్గ మూడ్ ప్ర‌కారం చూస్తే ఫ్యాబ్రిక్స్‌ను మార్చాల్సి వ‌చ్చింది. మేఘా ఆకాష్‌గారికి ముందుగా చుడీదార్ అనుకున్నాం. కానీ క‌థానుగుణంగా చుడీదార్ కంటే శారీనే బాగా న‌ప్పుతుంద‌నిపించింది. కాట‌న్‌, లెనిన్‌, ఖాదీ చీరల‌నే ఉప‌యోగించాం.

* నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌?

– ప్ర‌స్తుతం స‌తీష్ వేగేశ్న‌గారు ద‌ర్శ‌క‌త్వంలో హాట్ స్టార్ రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ మ‌ర్మ‌యోగి కోసం వ‌ర్క్ చేస్తున్నాను. రీసెంట్‌గానే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే మాన‌స‌చోర అనే సినిమాకు వ‌ర్క్ చేస్తున్నాను.

Show comments