మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ చిత్రం మహరాజ. యువ దర్శకుడు నితిలాన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు, పెద్దగా ప్రమోషన్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని విడుదలైన అన్నీ చోట్ల భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విజయం సాధించి రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది.
కాగా ఈ సినిమాను 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు నిర్మాతలు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిత్ర హీరో విజయ్ సేతుపతి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ చిత్రంలో నటించాడట. సినిమా విడుదలయ్యాక లాభాల్లో వాటా తీసుకొమని కొరక అందుకు అంగీకరించి ఫ్రీగా ఈ చిత్రంలో నటించాడు సేతుపతి. విడుదల నాటి నుండి సూపర్ హిట్ తో దూసుకు వెళ్ళింది మహారాజ. జూన్ 14వ తేదీన విడుదలైన ఈ సినిమా నేటికీ 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇటీవల కాలంలో ఓటీటీల హావ సాగుతుండగా కేవలం ఒకటి లేదా రెండు వారాలలోనే థియేటర్ల రన్ ముగిస్తుంటే మహారాజ అనుదుకు బిన్నంగా ఓటీటీలో విడుదలై కూడా థియేటర్లలో అర్ధశతదినోత్సవం ప్రదర్శింపబడి ఔరా అనిపించింది. ఇటు తెలుగులోను మహారాజ సూపర్ హిట్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మహారాజా 20కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. నిర్మాతలను వేధించే హీరోలు ఉన్న ఈ రోజుల్లో ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించి నిర్మాత మంచి కోరి, రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లో కూడా మహారాజా అనిపించుకున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.