టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సరికొత్త ఘనతను సాధించారు. ఇన్నేళ్ళుగా టాలీవుడ్ లో మరే ఇతర స్టార్ హీరోలు సాధించలేకపోయిన రికార్డును క్రియేట్ చేశాడు. వరుసగా మూడవసారి మోస్ట్ డిజైరబుల్ మాన్ గా నెంబర్ వన్ స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది కూడా ‘హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా 2020’గా నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుని హ్యాట్రిక్ కొట్టాడు. ఈ ప్రత్యేక రికార్డుపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ” ఎవరికైనా ఈ రికార్డును బీట్ చేయడం కష్టం అన్పించాలి. ఆ రేంజ్ లో రికార్డు క్రియేట్ చేయాలి” అంటూ తనదైన శైలిలో అన్నారు. ఇక హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆఫ్ 2020 టాప్ 30 జాబితాలో టాలీవుడ్ హీరోలు, క్రీడా ఛాంపియన్లు ఉన్నారు. విజయ్ తరువాత రామ్ (2), ఎన్టీఆర్ (3), రామ్ చరణ్ (4), నాగ శౌర్య (5), నాగ చైతన్య (6) ఉన్నారు. ఇక విజయ్ సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘లైగర్’, పైగా తన సొంత బ్యానర్ ‘కింగ్ ఆఫ్ ది హిల్’పై తక్కువ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు.
ఆ ఘనత విజయ్ దేవరకొండదే… వరుసగా మూడవసారి…!
