తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ ఓ రకమైన జాతరను తలిపిస్తుంది. ప్రస్తుతం మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విదాముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు అజిత్ కుమార్. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు విశేష స్పందన లభించింది.
ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 6న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో విడాముయార్చి అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేసారు మేకర్స్. ప్రముఖ బుకింగ్స్ యాప్ బుక్ మై షోలో ఓపెన్ చేయగా ట్రేడ్ వర్గాలను షాక్ కు గురిచేశాయి బుకింగ్స్. అసలు ఎటువంటి హడావిడి, ముందస్తు అనౌన్స్ మెంట్ లేకుండా విడాముయార్చి బుకింగ్స్ ను ఓపెన్ చేయగా గంటకు 15k టికెట్స్ బుక్ అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక్క ఇండియాలోనే అడ్వాన్సు సేల్స్ లో రూ. 2.5 కోట్లు దాటి దూసుకెళ్తోంది విడాముయార్చి. అసలు కనీసం ముందస్తు ప్రచారం, ఆర్భాటం వంటివి ఏమి లేకుండా ఈ రేంజ్ బుకింగ్స్ అంటే మాములు విషయం కాదని దట్ ఈజ్ అజిత్ అని ట్రేడ్ వర్గాలనుండి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనిరుధ్ సంగీతం సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దర్శకుడి మాగిజ్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.