Site icon NTV Telugu

Naga Vamsi : నాగవంశీపై నెగిటివ్ కామెంట్స్ కు ఇచ్చిపడేసిన వెంకీ అట్లూరి

Venky Atluri

Venky Atluri

ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన మలయాళ చిత్రం ‘లోకా చాప్టర్ 1: చంద్ర’. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ కె. గఫూర్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ‘కొత్త లోక 1: చంద్ర’ పేరుతో విడుదల చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో చిత్ర విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, వెంకీ అట్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “సినిమా నేను చూశాను. నాకు చాలా నచ్చింది. టెక్నికల్ గా బ్రిలియంట్ మూవీ. రూ. 30 కోట్లతో రూ. 300 కోట్ల రేంజ్ సినిమా తీశారని అందరూ అంటున్నారు. ఈ సినిమా ప్రారంభించినప్పుడు మలయాళ సినిమా పరంగా రూ. 30 కోట్లు అనేది చాలా ఎక్కువ. ఈ సినిమాని నమ్మి నిర్మాతగా ధైర్యం చేసిన దుల్కర్ సల్మాన్ గారిని ముందుగా అభినందించాలి. అలాగే సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి, ఆర్ట్ డైరెక్టర్ బంగ్లాన్ లను ప్రత్యేకంగా అభినందించాలి. మలయాళం పరిశ్రమలో అందరూ గొప్పగా నటిస్తారు. సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. కళ్యాణి ప్రియదర్శన్ గొప్పగా నటించింది. తాను నాకు తెలుసని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. యాక్షన్ సన్నివేశాలు తను చేసిన తీరుకి హ్యాట్సాఫ్. రచన అద్భుతంగా ఉంది. ఈ సినిమా ఇంత గొప్పగా మలిచిన దర్శకుడు డొమినిక్ అరుణ్ ప్రతి ప్రశంసకు అర్హుడు. నాగవంశీ ఆగస్టులో ఓ సినిమా వలన మాట పడ్డాడు. అదే నెల చివర్లో హిట్ సినిమాతో సమాధానం ఇచ్చాడు. దటీజ్ నాగవంశీ అని ” అన్నారు.

 

Exit mobile version