NTV Telugu Site icon

Varun Tej : మట్కా సెన్సార్ రిపోర్ట్ – రన్ టైమ్ పూర్తి డీటెయిల్స్

Matka

Matka

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మట్కా’ నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది.

Also Read : Dulquer Salmaan : సెంచరీకి చేరువలో ‘లక్కీ భాస్కర్’

తాజాగా సెన్సార్‌తో సహా అన్ని ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. మట్కా పర్ఫెక్ట్ స్క్రీన్‌ప్లేతో మొదటి నుండి చివరి వరకు రేసీగా, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. టైటిల్స్‌తో సహా మొత్తం 2 గంటల 39 నిమిషాల రన్‌టైమ్‌తో రానుంది. టైటిల్స్ లేకుండా, రన్‌టైమ్ 2 గంటల 33 నిమిషాలు ఉంటుంది. మాస్ ఎంటర్‌టైనర్‌కి ఇది సరైన రన్‌టైమ్ అనే చెప్పాలి. మొదటి సగం 1 గంట 22 నిమిషాలు మరియు రెండవ సగం 1 గంట 11 నిమిషాల వ్యవధి ఉండనుంది. ఫస్ట్ హాఫ్‌లో ఉత్కంఠభరితమైన ఇంటర్వెల్ బ్లాక్‌తో సహా 4 ఫైట్లు ఉండగా, చివరి 20 నిమిషాల క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలవనుంది. మట్కా గేమ్ అనేది కేవలం సినిమాలో ఒక భాగం మాత్రమే. ఇది వాస్తవానికి వాసు జీవితం ఆధారంగా తెరకెక్కింది, అతని 16 సంవత్సరాల వయస్సు నుండి 52 ఏళ్ల వ్యక్తి లైఫ్ జర్నీ ఈ సినిమా. అతని పాత్ర వయస్సు పెరిగే కొద్దీ అతని వాయిస్, బాడీ లాంగ్వేజ్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్‌లో వైవిధ్యాన్ని వరుణ్ తెజ్ కనబరిచాడు. సెన్సార్ రిపోర్ట్ పూర్తి పాజిటివ్ గా ఉండటంతో ఈ సినిమా ఓపెనింగ్స్ భారీగా ఉండే అవకాశం ఉంది.

Show comments