శాండల్ వుడ్ స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్ రవివర్మ దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. ఫలితంగా ఆయనకు బాలీవుడ్ లోనూ మంచి పేరు వచ్చింది. ఇప్పటికే ఆయన టాలీవుడ్ లో అజ్ఞాతవాసి, సరైనోడు, వకీల్ సాబ్… బాలీవుడ్ లో యాక్షన్ జాక్సన్, రీస్, కమాండో 3 తదితర చిత్రాలకు స్టార్ హీరోలతో పని చేశారు. ఇప్పుడు ఈ టాలెంటెడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ రవివర్మ బాలీవుడ్ లో దర్శకుడిగా అరంగేట్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ తో 2019లో యాక్షన్ డ్రామా “రుస్తోమ్”కు రవివర్మ దర్శకత్వం వహించారు. ఆయన తన బాలీవుడ్ ఎంట్రీ కోసం ఒక అవుట్-అండ్-అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధాన పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ స్టార్ ను సంప్రదించాలని భావిస్తున్నాడట రవివర్మ.
డైరెక్టర్ గా “వకీల్ సాబ్” యాక్షన్ కొరియోగ్రాఫర్
