ఊర్వశీ రౌతేలా మెగాస్టార్ చిరంజీవి మీద ప్రశంసల వర్షం కురిపించింది. ఊర్వశీ తల్లి మీను రౌతేలా ఈ మధ్య ఆస్పత్రి పాలైంది. ఆమె ఎడమ కాలిలో ఎముకలో ఇంట్రా ఆర్టిక్యూలర్ ఫ్రాక్చర్ కావడంతో ఊర్వశీ చిరంజీవిని సహాయం కోరిందట. చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య చిత్రంలో ‘వేర్ ఈజ్ ద పార్టీ బాసు’ సాంగ్‌లో కనిపించింది. ఆ పరిచయంతో చిరంజీవిని సహాయం అడిగితే చిరంజీవి కోల్‌కత్తా అపోలో ఆస్పత్రి బృందంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చేశారట. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ చిరంజీవి సేవా కార్యక్రమాల గురించి ఎంతో విన్నా, ‘వాల్తేరు వీరయ్య’ షూటింగ్‌లో ఆయన్ను ఎంతో గమనించా. ఆపద అన్నవారికి నేను చూస్తుండగానే ఎంతో సాయం అందించారు, అయితే ఆ సాయం నా వరకూ కూడా వచ్చింది.
kobali: ‘కోబలి’ పార్ట్-2 మరింత అలరిస్తుందట
ఎంతో మొహమాటంగా అడిగా, నిర్భయంగా ఉండమని ధైర్యం చెప్పి, ఒక రక్షకుడిలా సమస్యకు సంబంధించిన అన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వెంటనే కలకత్తాలోని అపోలో సిబ్బందితో మాట్లాడి మంచి వైద్యం అందేలా చేశారు. అంతేకాదు ‘మీ అమ్మకి ఏమీ కాదు. ఆరోగ్యంగా ఉంటారు’ అని ధైర్యం చెప్పారని పేర్కొంది. ఆ సమయంలో ఆయన మాటలు కొండంత ధైర్యానిచ్చి మా కుటుంబానికి శ్వాస నిచ్చిన నిజమైన హీరోలా కనిపించారు. కష్టకాలంలో ఆయన చూపించిన ప్రేమని మాటల్లో చెప్పలేను. భూమ్మీద ఇంకా మంచి, మానవత్వం బతికే ఉందని చిరంజీవి నిరూపించారు. అంత బిజీ షెడ్యూల్‌లోనూ ఆయన ఎప్పటికప్పుడు అప్‌డేట్ తీసుకున్నారు. ఏ అవసరం వచ్చిన అడగటానికి మొహమాటపడొద్దని పదేపదే చెప్పడంతో ఆయన మా పాలిట ఓ రక్షకుడిగా, దేవదూతలాగా కనిపించారు అంటూ ఆమె ఎమోషనల్ అయింది.