NTV Telugu Site icon

Pushpa 3 : ‘పుష్ప-3’లో ఇద్దరు స్టార్స్..ఇందులో నిజమెంత!

Pushpa3

Pushpa3

స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘పుష్ప’. 2021లో మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్’ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన రెండో భాగం ‘పుష్ప 2: ది రూల్‌’ ఏకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ వసూళ్లతో వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్‌ను రూల్ చేసింది. ఓటీటీలోనూ ఈ సినిమాకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఒక్క మూవీతో ఇటు అల్లు అర్జున్, రష్మిక మూవీ టీం అందరికీ మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమాకు మరో సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటన ఇవ్వడంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతోందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సుకుమార్ కూడా ఈ చిత్ర కథను మరింత పవర్‌ఫుల్‌గా రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో రోజుకో వార్త  చక్కర్లు కొడుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విలన్ పాత్ర పై సరికొత్త బజ్ వినిపిస్తోంది. ఎంటీ అంటే విలన్ పాత్ర కోసం ఈ సినిమాలో ఇద్దరిని యాకక్టర్స్‌ని పెట్టాలని ఆయన చూస్తున్నాడట. ఇంతకి ఎవరు అంటే దీనికోసం విజయ్ దేవరకొండ, నాని పేర్లను ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విజయ్ దేవరకొండ ఈ సినిమాలో విలన్‌గా ఉంటాడనే వార్త వైరల్ అయ్యింది. ఇప్పుడు నాని కూడా యాడ్ కావడంతో నిజంగానే సుకుమార్ ఇలాంటిది ప్లాన్ చేస్తున్నాడా అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కనుక నిజం అయితే మూవీ అభిమానులకు పూనకాలే..