Site icon NTV Telugu

ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘ది బర్త్ 10000 బీసీ’ ట్రైలర్

Trailer of The Birth 10000 BC launched by Sai Dharam Tej

డాక్టర్ విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది బర్త్ 10000 బీసీ’. రానా ప్రతాప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శ్రీ వినాయక మారుతి క్రియేషన్స్, లక్ష ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రదీప్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జుడా సంధి సంగీతం అందిస్తున్నారు. కన్నడ భాషలో తెరకెక్కుతున్న ఆ యాక్షన్ థ్రిల్లర్ ను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ‘ది బర్త్ 10000 బీసీ’ ట్రైలర్ ను సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మనిషి పుట్టుక, 10000 బీసీలో మానవ జీవన విధానం ఎలా ఉండేది తదితర అంశాలను చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ట్రైలర్ లోని సన్నివేశాలు, సాహసాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘ది బర్త్ 10000 బీసీ’ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

https://www.youtube.com/watch?v=QWz9tWnuvuk
Exit mobile version