NTV Telugu Site icon

ఆసక్తిని రేకెత్తిస్తున్న “కోల్డ్ కేస్” ట్రైలర్

Trailer of Prithviraj Sukumaran's Cold Case Movie

మలయాళ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన థ్రిల్లర్ మూవీ ‘కోల్డ్ కేస్’. తను బాలక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా `అరువి’ ఫేమ్ అదతి బాలన్ నటిస్తోంది. ఈ సినిమాను సినిమాటోగ్రాఫర్ జోమో టి. జాన్, ఎడిటర్ షమీర్ ముహమ్మద్, ఆంటో జోసెఫ్ సంయుక్తంగా నిర్మించారు. జోమో… గిరీష్ గంగాధరన్ తో కలిసి సినిమాటోగ్రఫీ అందించగా, షమీర్ ముహమ్మద్ ఎడిటింగ్ చేస్తున్నాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 30న స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

Read Also : అప్పుడు ఇండియాలో, ఇప్పుడు ఇంగ్లాండ్ లో… క్రికెట్ మధ్యలో అజిత్ ఫ్యాన్స్ రచ్చ!

తాజాగా మేకర్స్ “కోల్డ్ కేస్” ట్రైలర్ ను విడుదల చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన ఓ హత్యకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆఫీసర్ సత్యజిత్ ఐపీఎస్ గా పృథ్వీరాజ్ నటిస్తున్నాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ సినిమా కోసం మళ్ళీ పృథ్వీరాజ్ పోలీస్ దుస్తులు ధరించాడు. ఇక ట్రైలర్ లో సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ అంశాలు కలగలిపి ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఉత్కంఠభరితంగా ఉన్న “కోల్డ్ కేస్” ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.