Site icon NTV Telugu

Vasudevasutam : మహేంద్రన్ ‘వసుదేవసుతం’ సాంగ్ భలే ఉందే!

Vasudeva

Vasudeva

మాస్టర్ మహేంద్రన్ హీరోగా బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్ యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల నిర్మాతగా వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్‌ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్‌ను హీరో ఆకాష్ జగన్నాథ్ రిలీజ్ చేశారు.

‘వసుదేవసుతం దేవం’ అంటూ సాగే ఈ పాటను ఆకాష్ జగన్నాథ్ విడుదల చేశారు. చైతన్య ప్రసాద్ అందించిన సాహిత్యం, పవన్-శృతిక సముద్రాల గాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరో చార్ట్ బస్టర్ సాంగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ లిరికల్ వీడియోలో హీరో హీరోయిన్ జంట చూడముచ్చటగా ఉంది. ఊరి వాతావరణం, గుడిలో చిత్రీకరించిన ఈ పాట అందరినీ కట్టి పడేసేలా ఉంది. ఇక తెర అంతా కూడా కలర్ ఫుల్‌గా కనిపిస్తోంది. కొరియోగ్రాఫీ కూడా ఎంతో చక్కగా కుదిరినట్టు కనిపిస్తోంది.

Exit mobile version