బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ ఓ నెటిజన్ కు దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చింది. ఇటీవల కృష్ణ ష్రాఫ్ ఇన్‌స్టాగ్రామ్ లో తన హాట్ బికినీ పిక్స్ ను షేర్ చేశారు. దానికి “వైల్డ్ చైల్డ్” అనే ట్యాగ్ ను ఇచ్చారామె. కృష్ణ షేర్ చేసిన ఆ హాట్ బికినీ పిక్స్ పై బాలీవుడ్ సెలెబ్రిటీలు హ్యూమా ఖురేషి, పూజా భట్, శక్తి కపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్, దిషా పటాని తదితరులు ప్రశంసించారు. దీంతో కృష్ణ ష్రాఫ్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆ పిక్స్ చూసిన ఓ నెటిజన్ కృష్ణ ష్రాఫ్ ను తన సోదరుడు టైగర్ ష్రాఫ్ తో పోలుస్తూ మీకు సిగ్గుగా లేదా ? అని ప్రశ్నించాడు. ఆ నెటిజన్ “మేడం మీ సోదరుడు టైగర్ ఎంత బాగుంటారో మీరు అంత బేకార్… ఇలాంటి ఫోటోలు షేర్ చేయడానికి సిగ్గుగా అన్పించడం లేదా ? మీ తల్లిదండ్రులు ఈ ఫోటోలు చూడలేదా ?” అంటూ కామెంట్ చేశాడు. దీంతో కృష్ణ సదరు నెటిజన్ కు “నా పట్ల మీకున్న కన్సర్న్ కు చాలా థాంక్స్ సర్… బట్ యూ కెన్ ***… ఎవరైనా ఇతని కోసం నా సమాధానాన్ని ట్రాన్స్లేట్ చేయండి” అంటూ ఘాటు రిప్లై ఇచ్చింది.