Site icon NTV Telugu

Sweety Naughty Crazy: ‘స్వీటీ నాటీ క్రేజీ’ అంటున్న త్రిగుణ్

Trigun New Movie

Trigun New Movie

Thrigun Starrer Sweety Naughty Crazy Movie Launched: త్రిగుణ్, శ్రీజిత ఘోష్ హీరో హీరోయిన్లుగా అరుణ్ విజువల్స్ బ్యానర్ మీద ఆర్. అరుణ్ నిర్మిస్తున్న చిత్రం ‘స్వీటీ నాటీ క్రేజీ’. ఈ మూవీకి రాజశేఖర్.జి దర్శకత్వం వహిస్తుండగా ఈ రోజు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం నాడు అతిథుల సమక్షంలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. త్రిగుణ్, శ్రీజిత ఘెష్, ఇనయ, రాధ, అలీ, రఘుబాబు, రవి మరియ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి అలీ క్లాప్ కొట్టగా.. దామోదర ప్రసాద్ స్క్రిప్ట్ అందజేయగా.. బెక్కెం వేణు గోపాల్ గారు దర్శకత్వం వహించారు. అనంతరం మీడియాతో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. శ్రీజిత, ఇనియలకి ఇందులో మంచి పాత్రలుంటాయి. టైటిల్‌కు తగ్గట్టుగా.. స్వీటీ, నాటీ, క్రేజీలా ఉంటాయి.

నాకు ఇంత వరకు కామెడీ చిత్రాలు బాగా వర్కౌట్ అయ్యాయి అని అన్నారు. హీరోయిన్ ఇనియ మాట్లాడుతూ ఇది నాకు 45వ సినిమా. బాలనటిగా కెరీర్ మొదలు పెట్టా, ఇందులో నందిని అనే మంచి పాత్రను చేస్తున్నానన్నారు. హీరోయిన్ రాధ మాట్లాడుతూ ఇనియతో ఇప్పటికే నేను తమిళంలో చేశాను. త్రిగుణ్‌తో నటించడం ఆనందంగా ఉంది. ఇది నాకు రీ ఎంట్రీలా అనిపిస్తోందన్నారు. హీరోయిన్ శ్రీజిత ఘోష్ మాట్లాడుతూ నటిగా అన్ని రకాల పాత్రలను, సినిమాలను చేయాలని ఈ చిత్రాన్ని ఎంచుకున్నా, ఇది చాలా మంచి చిత్రం అవుతుందని నమ్మకం ఉందన్నారు. దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘సినిమా పూర్తిగా వినోదాత్మకంగా, అందరినీ నవ్వించేలా ఉంటుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, కామెడీ యాంగిల్‌లో సినిమా ఉంటుందన్నారు.

Exit mobile version