కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ చెప్పక్కరర్లేదు. అయితే 2024 లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు అజిత్. . విదాముయర్చితో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రాజెక్టులలో నటిస్తున్న అజిత్ ఈ ఏడాది సంక్రాంతికి విదాముయర్చిని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్ ఉన్నట్టుండి అనివార్య కారణాల వలన ఈ సినిమా పొంగల్ రిలీజ్ వాయిదా వేశారు మేకర్స్. విదాముయర్చి ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ రిలీజ్ కు అడ్డంకులు ఏర్పడడంతో రిలీజ్ కు బ్రేక్ పడింది.
Also Read : Daaku Maharaaj : వంద కోట్ల క్లబ్ లో డాకు మహారాజ్.. బాలయ్య కింగ్ అఫ్ సంక్రాంతి
మజీజ్ తిరుమనేని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా దీపావళికే సినిమా రిలీజ్ చేయాలనుకుంటే షూటింగ్ చివరి దశలో ఉండటం, పోస్టు ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ లో ఉండటంతో సంకాంత్రికి అక్కడి నుండి జనవరి చివరి వారానికి పోస్టు పోన్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్ కు విపరీతమైన స్పందన లభించగా విదాముయర్చి ట్రైలర్ ను నేడుసాయంత్రం 6: 40కి రిలీజ్ చేయనున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. అలాగే విదాముయర్చి తెలుగు టైటిల్ ను కూడా ఫిక్స్ చేస్తూ అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు. విదాముయర్చి సినిమాను తెలుగులో ‘పట్టుదల’ పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా జనవరి 26న విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ భావిస్తున్నట్టు చెన్నై వర్గాల సమాచారం. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అజిత్ కు జోడిగా త్రిష నటిస్తుండగా అత్యంత భారీ బడ్జెట్ పై లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.