Site icon NTV Telugu

THE STAR ENTERTAINER : ఓవర్సీస్ లో హ్యాట్రిక్ 1 మిలియన్ వసూళ్లు రాబట్టిన యంగ్ హీరో

Aor

Aor

ఈ సంక్రాంతిని నవ్వుల పండుగలా మార్చడానికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో థియేటర్లలో అడుగుపెట్టారు స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి. మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.

Also Read : Pushpa – 3 : బన్నీ బిజీ.. పుష్ప – 3 పనులు స్టార్ట్ చేసిన సుకుమార్?

భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం.. మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, చివరిలో భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలను హత్తుకొని.. అసలు సిసలైన పండగ సినిమాలా ఉందని ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు ‘అనగనగా ఒక రాజు’.తోలి రోజు ఏకంగా రూ. 22 కోట్ల గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక మూడు రోజుల్లో ఏకంగా రూ. 61.1 కోట్లు కొల్లగొట్టి డిస్ట్రిబ్యూటర్స్ కు కాసుల పంట పండించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దంచి కొడుతున్నాడు రాజు గారు. శనివారం ముగిసేనాటికి 1 మిలియన్ డాలర్స్ వసూళ్లు రాబట్టింది. ఈ కలెక్షన్స్ తో వరుసగా మూడు సినిమాలు (జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు) 1 మిలియన్ రాబట్టిన హీరోగా నవీన్ పోలిశెట్టి అదరగొట్టాడు.

Exit mobile version