శర్వానంద్ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భోగి‘. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా మాస్ అంశాలతో కూడిన ఈ చిత్రంలో శర్వానంద్ మునుపెన్నడూ చూడని డిఫరెంట్ లుక్‌లో దర్శనమిస్తున్నాడు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. రా, రస్టిక్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం శర్వానంద్ కెరీర్‌లోనే ఓ ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలవబోతోందని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో శర్వానంద్ ‘గంగ‘ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. రగ్గడ్ మేకోవర్, రస్టిక్ లుక్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్ అండ్ ఫ్యామిలీ రోల్స్‌తో ఆకట్టుకున్న శర్వానంద్, ఈ సినిమాలో పూర్తి భిన్నమైన మాస్ షేడ్స్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంపత్ నంది తన మార్క్ రస్టిక్ అండ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ నెరేషన్‌తో తెరకెక్కిస్తున్నాడు .టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ మరియు నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సి ఉన్న భోగి అనుకోని కారణాల వలన వాయిదా పడింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను నవంబర్ 13న థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

